Revanth Reddy : మోదీ సర్కార్ కు మూడింది – రేవంత్
అక్రమ కేసులపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం
Revanth Reddy : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ సర్కార్ కావాలని కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం పనిగా పెట్టుకున్నారంటూ నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యా గ్రహ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.
ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకోబోమన్నారు. మోదీ సర్కార్ కు కాలం చెల్లిందన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ మేరకు ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సమన్లు పంపించింది.
ఆరోగ్య పరంగా టెస్టులు చేసుకున్న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆమె తనకు గడువు కావాలని కోరింది. ఆస్పత్రిలో చేరారు.
ఇక ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాలి నడకన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
144 సెక్షన్ విధించారు. ఏఐసీసీ కార్యాలయం మొత్తం పోలీసులతో నిండి పోయింది. ఇక ఈడీ ఆఫీసుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఆయన వెంటన చెల్లెలు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
అకారణంగా నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
Also Read : తెలంగాణలో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ భారీ పెట్టుబడి