CEB Chairman : మోదీపై కామెంట్స్ సీఇబి చైర్మన్ రిజైన్
అదానీ గ్రూప్ కు ఇవ్వాలంటూ ఒత్తిడి
CEB Chairman : శ్రీలంక సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సిఇబి) చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాడో తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు చైర్మన్ సంచలన కామెంట్స్ చేశారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై.
పవన విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టును అదానీ చైర్మన్ గా ఉన్న అదానీ గ్రూప్ కు ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారంటూ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే చెప్పారంటూ సిఇబీ చైర్మన్(CEB Chairman) తనతో చెప్పారంటూ వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగాయి. పెద్ద ఎత్తున ఆయన చేసిన కామెంట్స్ తో కూడిన వీడియో వైరల్ గా మారింది. చివరకు శ్రీలంక ప్రెసిడెంట్ జోక్యం చేసుకోవాల్సింది.
ఆ తర్వాత తాను అన్న మాటల్ని ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటించారు సిఇబి చైర్మన్(CEB Chairman). ఇదిలా ఉండగా ఇప్పటికే ఆర్థికంగా దివాలా అంచున నిలబడిన శ్రీలంక దేశాన్ని ఆదుకుంది భారత దేశం.
ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల శ్రీలంక, భారత్ ల మధ్య సత్ సంబంధాలు బెడిసి కొట్టే ప్రమాదం ఉందని గ్రహించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి, ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు.
వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. కీలక వ్యాఖ్యలు చేసిన సిఇబి చైర్మన్ ను తప్పుకోవాలని సూచించారు. దీంతో ఆయన మోదీ దెబ్బకు ఏకంగా పదవినే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో 500 మెగా వాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు పర్మిషన్స్ వేగవంతం చేయాలంటూ ఆర్థిక శాఖకు లేఖ కూడా రాశారు. ఇంతలోనే పదవి నుంచి తప్పుకోవడం చర్చకు దారితీసింది.
Also Read : నూపుర్ శర్మ కామెంట్స్ పై చైనా స్పందన