P Chidambaram : ఖాకీల నిర్వాకం చిదంబరంకు గాయం
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత సూర్జేవాలా
P Chidambaram : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యా గ్రహ్ యాత్ర సందర్భంగా చేపటిన నిరసన కార్యక్రమంలో ఢిల్లీ పోలీసులు అనుచితంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరంను నెట్టి వేయడంతో ఆయన గాయపడ్డారంటూ మరో సీనియర్ నాయకుడు రణ్ దీప్ సూర్జేవాలా ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ మేరకు రాహుల్ పాదయాత్ర ద్వారా ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ తరుణంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈడీ ఆఫీసు వెలుపల నిరసన తెలిపిన వందలాది కార్యకర్తలు, నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే సమయంలో అక్కడే ఉన్న పి. చిదంబరం(P Chidambaram) ను పోలీసులు నెట్టి వేశారు.
దీంతో ఆయన అదుపు తప్పి పడి పోయారు. పక్కటెముక ఫ్రాక్చర్ అయ్యిందని రణ్ దీప్ సూర్జేవాలా ఆరోపించారు. హెయిర్ లైన్ క్రాక్ తో తప్పించు కోవడం వల్ల బతికి పోయానంటూ పి. చిదంబరం(P Chidambaram) ట్వీట్ చేశారు.
వైద్యుల వద్దకు వెళ్లాను. 10 రోజుల్లో దానంతట అదే నయం అవుతుందని చెప్పారని వెల్లడించారు. ప్రస్తుతం తాను బెడ్ రెస్ట్ తీసకుంటున్నట్లు తెలిపారు.
మరో వైపు కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివతిని రోడ్డుపై పడేయడంతో తలకు గాయమైందని వెల్లడించారు రణ్ దీప్ సూర్జేవాలా.మోదీ సంకీర్ణ సర్కార్ బ్రిటిష్ పాలకులను మైమరిపించేలా చేస్తోందంటూ ఆరోపించారు.
Also Read : ఈడీ ముందుకు మరోసారి రాహుల్ గాంధీ