Canadian PM : కెనడా పీఎం జస్టిన్ ట్రూడోకు కరోనా
వ్యాక్సిన్లు వేసుకోండి జాగ్రత్తగా ఉండండి
Canadian PM : కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. కొంత కాలం పాటు తగ్గుముఖం పట్టినా మరోసారి అది తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా తనకు టెస్టింగ్ లో కోవిడ్ పాజిటివ్ అని తేలిందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(Canadian PM) వెల్లడించారు.
ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని అప్పీల్ చేశారు. ఎవరైనా సరే టీకాలు వేసుకోని వారు ఉన్నట్లయితే వెంటనే వ్యాక్సిన్లు వేసుకోవానలి సూచించారు.
అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు జస్టిన్ ట్రూడో(Canadian PM). తాను ప్రజారోగగ్య మార్గదర్శకాలను అనుసరిస్తానని తెలిపారు.
టీకాలు వేసుకున్న వారైతే ఓకే. కానీ వేసుకోని వారు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలని విన్నవించారు. ఒకరినొకరు ఆరోగ్యాన్ని కాపాడు కోవాల్సిన అవసరం మనందరిపై ఉందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
అయితే దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తాను తీసుకుంటానని, ఒంటరిగా ఉంటూనే పని చేస్తానని స్పష్టం చేశారు జస్టిన్ ట్రూడో. ఇదిలా ఉండగా పార్లమెంట్ సమావేశాలలో కరోనా కారణంగా పీఎం హాజరు కాలేక పోవచ్చని సమాచారం.
కాగా కరోనాకు సంబంధించి ట్రూడో బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. అంతకు ముందు తన భార్య సోఫీకి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ట్రూడో కొంత కాలం పాటు దూరంగా ఉన్నారు.
Also Read : నూపుర్ శర్మ కామెంట్స్ పై చైనా స్పందన