Rahul Gandhi ED : ముగిసిన రాహుల్ గాంధీ ఈడీ విచారణ
రెండో రోజు విచారణ తీవ్రంగా నిరసన
Rahul Gandhi ED : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందంటూ సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ మేరకు తల్లీ కొడుకులకు నోటీసులు ఇస్తే సోనియా గాంధీకి కరోనా సోకడంతో హాజరు కాలేదు.
మరో వైపు రాహుల్ గాంధీ(Rahul Gandhi ED) నోటీసు మేరకు సోమవారం హాజరయ్యారు. ఆయనను 10 గంటలకు పైగా ఈడీ విచారణ చేపట్టింది. ప్రశ్నల వర్షం కురిపించింది. మంగళవారం కూడా మరోసారి విచారణకు పిలిచింది.
ఈ మేరకు రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. తాజాగా ఆయన విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి.
144 సెక్షన్ విధించారు. ఇక విచారణకు సంబంధించి ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. న్యాయ పరమైన లాంచనాలు పూర్తయ్యాక విచారణ స్టార్ట్ చేశారు.
ఆయన వెంట చెల్లెలు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. కానీ ఆఫీసు వెలుపల ఉన్నారు. సీనియర్ నాయకులు సైతం పాల్గొన్నారు. ఆఫీసు చుట్టూ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీ జెడ్ ప్లస్ కేటగిరీ మధ్యన ఎంట్రీ ఇచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ED). ఇదిలా ఉండగా హరీష్ రావత్, రణ్ దీప్ సింగ్ ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు రాహుల్ గాంధీకి ఈడీ 25 ప్రశ్నలు వేశారు. ఇదిలా ఉండగా కేసు ఎప్పుడో కొట్టి వేశారని, కానీ కావాలని అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ పబ్బం గడిపే ప్రయత్నం మోదీ సర్కార్ చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Also Read : దీదీ సమావేశానికి కాంగ్రెస్ ఓకే