Sharad Pawar : రాష్ట్రపతి పదవికి పోటీ చేయలేను – పవార్
మమతా బెనర్జీ సమావేశంలో స్పష్టమైన ప్రకటన
Sharad Pawar : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేపుతోంది రాష్ట్రపతి పదవి అభ్యర్థి ఎంపిక. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కోరుతూ టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన బాధ్యులు హాజరయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో మధ్యాహ్నం ఈ కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు పవార్(Sharad Pawar) ను దీదీ ప్రతిపాదించారని కానీ అందుకు ఒప్పుకోలేదని తెలిసింది. తనకు వ్యక్తిగత పనులు చాలా ఉన్నాయని, తాను పోటీలో లేనన్నారు.
క్రియాశీల రాజకీయాలలో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు ఇంకా ఎవరి పేరును సూచించ లేక పోవడం విశేషం.
జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు గాను ఈ సమావేశం చేపట్్టారు మమతా బెనర్జీ. ఇక దీదీ ఆహ్వానానికి సీఎంలు పెద్దగా స్పందించ లేదు.
హాజరు కాని వారిలో సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.
ఇక ఈ మీటింగ్ కు సీపీఐ, సీపీఎం, సీపీఎం ఎల్, ఆర్ఎస్పీ, శివ సేన, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్ వాది పార్టీ, పీడీపీ, జేడీఎస్ , డీఎంకే, ఆర్ఎల్డీ, ఐయూ ఎంఎల్ , జేఎంఎం ప్రతినిధులు హాజరయ్యారు.
Also Read : పిలుపు లేదు అయినా వెళ్లేది లేదు