Rahul Gandhi ED Case : కేంద్రం తీరుపై కాంగ్రెస్ క‌న్నెర్ర‌

నిర‌స‌న తెలిపే హ‌క్కు లేదా

Rahul Gandhi ED Case : నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi ED Case) విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మూడో రోజు కూడా ఈడీ ముందుకు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ కు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఢిల్లీకి చేరుకున్నారు. బేష‌ర‌త్తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

వీరితో పాటు పార్టీకి చెందిన సీనియ‌ర్లు, సీఎంలు, ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ ఉన్నారు. పార్టీ కీల‌క నేత కేసీ వేణుగోపాల్ పై చేయి చేసుకున్నంత ప‌ని చేశారు పోలీసులు.

మ‌రో వైపు కేంద్ర మాజీ మంత్రి , ప్ర‌స్తుత ఎంపీ పి. చిదంబ‌రం తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ర‌ణ్ దీప్ సింగ్ సూర్జేవాలా.

త‌మ‌కు శాంతియుతంగా నిర‌స‌న తెలిపే హ‌క్కు లేదా అని ప్ర‌శ్నించారు మ‌రో ఎంపీ కార్తీ చిదంబ‌రం. ఆయ‌న బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా పోలీసులు దాడికి పాల్ప‌డే వీడియోను పంచుకున్నారు.

ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. చాలా మంది కార్య‌క‌ర్త‌ల‌ను ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను అని చూడ‌కుండా లాఠీ చార్జీ చేశార‌ని ఆరోపించారు ఎంపీ. అక్ర‌మంగా పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించార‌ని మండిప‌డ్డారు.

దేశంలో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ఒక రూల్ ఇత‌ర పార్టీల‌కు చెందిన వారికి మ‌రో రూల్ అమ‌లు అవుతోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఢిల్లీ పోలీసులు బీజేపీకి చెందిన ప్రైవేట్ సైన్యంలా వ్య‌వ‌హ‌రించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : మూడో రోజు రాహుల్ ను ప్ర‌శ్నిస్తున్న ఈడీ

Leave A Reply

Your Email Id will not be published!