Sadhguru : మట్టిని కాపాడుకోక పోతే ప్రమాదం – సద్గురు
హెచ్చరించిన జగ్గీ వాసుదేవన్
Sadhguru : మనమంతా అభివృద్ధి, టెక్నాలజీ పేరుతో నిత్యం జపం చేస్తున్నాం. కానీ ఈ ప్రపంచ మనుగడకు ఆధారమైన మట్టిని రక్షించు కోవాలన్న దానిని విస్మరిస్తున్నాం.
ఇప్పటికే విలువైన ఈ భూమి కొలిమి లాగా మారుతోంది. అయినా పట్టించు కోవడం మానేశామని ఇషా ఫౌండేషన్ ఫౌండర్, యోగా గురు సద్గురు జగ్జీ వాసుదేవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సేవ్ సాయిల్ పేరుతో 100 రోజుల ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. ఆయన ఒక్కడే బైక్ పై జర్నీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఎన్నో దేశాల అధిపతులు సద్గురుతో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో జగ్గీ వాసుదేవన్ (Sadhguru) పాల్గొన్నారు. ఇషా ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ నటి సమంత సద్గురుతో సంభాషించారు. పలు ప్రశ్నలు వేశారు. వాటన్నింటికి జగ్గీ వాసు దేవన్ కూల్ గా సమాధానం ఇచ్చారు. భూమిని కాపాడుకోక పోతే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని హెచ్చరించారు.
దీనిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 90 శాతం భూమి 2050 నాటికి పూర్తిగా నిస్సారంగా మారి పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు సద్గురు(Sadhguru).
మట్టిని కాపాడుకోక పోతే ఆహార, నీటి సంక్షోభం ఏర్పడుతుందన్నారు. లక్షలాది మంది ఆకలి చావులకు గురయ్యే చాన్స్ ఉందన్నారు.
అంతకు ముందు లండన్ లోని ట్రాఫల్ గర్ స్క్వేర్ నుంచి సద్గురు జర్నీ స్టార్ట్ అయ్యింది. 27 దేశాల మీదుగా 30 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం కొనసాగింది.
Also Read : సంత్ తుకారాం బోధనలు అనుసరణీయం
Sadhguru in Hyderabad to #SaveSoil – LIVE | 15 June | 7:00 PM IST | https://t.co/cUGbV7YaYR https://t.co/JzwxuSz6Za
— Sadhguru (@SadhguruJV) June 15, 2022