Manish Tiwary : ఐపీఎల్ నుంచి అమెజాన్ డ్రాప్ వెనుక‌

డ్రాప్ కావ‌డం వెనుక మ‌నీష్ తివారీ హ‌స్తం

Manish Tiwary : ప్ర‌పంచ వ్యాప్తంగా బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 వేలం పాట‌లో ఊహించ‌ని రీతిలో రూ. 48,390 కోట్లు ప‌లికింది. ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ లీగ్ ల‌లో రెండో లీగ్ గా ఐపీఎల్ నిలిచింది.

ఐదేళ్ల కాలానికి డిజిట‌ల్ , టీవీ రైట్స ఊహించ‌ని రీతిలో అమ్ముడు పోయాయి. టీవీ రైట్స్ స్టార్ గెలుచుకోగా డిజిట‌ల్ రైట్స్ రిల‌య‌న్స్ వయా కామ్ 18 ద‌క్కించుకుంది.

చివ‌రి దాకా అమెజాన్ పోటీలో ఉంటుంద‌ని అనుకున్నారంతా. కానీ మొద‌ట్లోనే త‌ప్పుకుంది అమెజాన్. అది త‌ప్పు కోవడం వెనుక రెండు నెల‌ల కింద‌ట ఎంపికైన మ‌నీష్ తివారీ హ‌స్తం ఉంది.

ఐపీఎల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ కంటే వ్యాపారంపైనే ఎక్కువ ఫోకస్ పెడితే బెట‌ర్ అని త‌ప్పుకున్న‌ట్లు తెలిపారు తివారీ. ఎందుకు రిస్క్ తీసుకోవాల‌న్న‌ది ఆలోచించారు.

ఇదే పెట్టుబ‌డిని భార‌త దేశ వ్యాప్తంగా ఎందుకు వ్యాపించేలా చేసేందుకు ఖ‌ర్చు చేయ‌కూడ‌దు అన్న దానిపై ఫోక‌స్ పెట్టారు. ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం పాట కంటే ముందే అమెజాన్ త‌ప్పుకుంది.

ఆ కంపెనీతో పాటు టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ కూడా వైదొలొగింది. మ‌నీష్ తివారీతో పాటు సీటెల్ లోని సీనియ‌ర్ మేనేజ్ మెంట్ అమెజాన్ ఇ-కామ‌ర్స్ వ్యాపారం కోసం బిలియ‌న్ల‌ను బాగా ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

బెంగ‌ళూరు లోని య‌శ్వంత్ పూర్ అమెజాన్ ప్ర‌ధాన కార్యాల‌యంలోని 27వ అంత‌స్తులో దేశాధినేత‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మ‌నీష్ తివారీ(Manish Tiwary) కి ఇప్పుడు 52 ఏళ్లు. యునిలివ‌ర్ పీఎల్సీ ఎగ్జిక్యూటివ్ గా గ‌తంలో ప‌ని చేశారు.

జెఫ్ బెజోస్ ఆధ్వ‌ర్యంలో అమెజాన్ ఇండియాను టార్గెట్ గా పెట్టుకుంది. $6.5 బిలియ‌న్ల కంటే ఎక్కువ పెట్టుబ‌డి పెట్టింది. 1,10,000 మందికి ఉపాధి క‌ల్పించింది అమెజాన్.

Also Read : ఎట్ట‌కేల‌కు సంజూ శాంస‌న్ కు చాన్స్

Leave A Reply

Your Email Id will not be published!