Agnipath Scheme Protest : అగ్గి రాజేసిన అగ్నిపథ్ స్కీం
దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన
Agnipath Scheme Protest : నరేంద్ర మోదీ ప్రకటించిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం(Agnipath Scheme Protest) కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా అల్లర్లకు, హింసకు దారి తీసేలా చేసింది. యువతీ యువకులకు ఈ పథకం కింద నాలుగేళ్ల పాటు సాయుధ దళాల్లో భర్తీ చేసుకుంటారు.
ఇదంతా కేవలం కాంట్రాక్టు పద్దతిన కొనసాగుతుంది. ఆ తర్వాత జాబ్ కు భరోసా ఉండదు. దీనిని నిరసిస్తూ యువత రోడ్డెక్కారు. అగ్నిపథ్ స్కీం ప్రకటించిన వెంటనే ఆందోళలన మొదలైంది.
ప్రధానంగా బీహార్ లో హింస మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇతర రాష్ట్రాలకు ఈ సెగ తగిలింది. జెహనాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు గుమి గూడారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
వారిపై ఎక్కుపెట్టారు ఖాకీలు. ఇక ఆగ్రాలో దూకుడుగా ఉన్న నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
సాయుధ బలగాలు (ఆర్మీ) కోసం రాడికల్ రిక్రూట్ మెంట్ ప్లాన్ గా కేంద్ర సర్కార్ పేర్కొంది అగ్నిపథ్ స్కీంను(Agnipath Scheme Protest). దీనికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు, ఆందోళనలు నిన్న శాంతియుతంగా జరగగా గురువారం అవి హింసాత్మకంగా మారాయి.
ఆర్మీలో చేరాలని అనుకునే యువత బీహార్ లోని అనేక ప్రాంతాల్లో రైలు, రహదారులపై బైఠాయించారు. భభువా రోడ్ రైల్వే స్టేషన్ లో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు అద్దాలు పగులగొట్టారు.
ఇండియన్ ఆర్మీ లవర్స్ అంటూ బ్యానర్లు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. జెహనాబాద్ లో పలువురు గాయపడ్డారు. ఇక నవాడా ప్రాంతంలో టైర్లకు నిప్పంటించారు. పీఎం మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read : కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి