Renuka Chowdhury : రేణుకా చౌదరిపై కేసు నమోదు
ఎస్ఐ కాలర్ పట్టుకున్నారని ఆరోపణ
Renuka Chowdhury : కాంగ్రెస్ మాజీ ఎంపీ , పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి(Renuka Chowdhury) పై కేసు నమోదైంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో చలో రాజ్ భవన్ ముట్టడించే కార్యక్రమాన్ని చేపట్టారు.
మొదట్లో శాంతియుతంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద బైకుకు నిప్పంటించారు. మరో సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క డీసీపీపై చేయి చేసుకున్నారంటూ ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా రేణుకా చౌదరి(Renuka Chowdhury) పై గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి.
ఈ మేరకు ఎస్ఐ ఉపేంద్ర బాబు ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వెల్లడించారు. ఘటన అనంతరం రేణుకా చౌదరిని అరెస్ట్ చేశారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆమెను రిమాండ్ కు తరలించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను వెనుకాల నుంచి తోసేయడంతో ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అతడిని అవమానించే ఉద్దేశం తనకు లేదన్నారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తనకు బాగా తెలుసన్నారు. ఖాకీల పట్ల గౌరవం ఉందన్నారు రేణుకా చౌదరి.
Also Read : హిట్లర్ ను తలపిస్తున్న కేంద్ర పాలన