Jairam Ramesh : జైరాం రమేశ్ కు కాంగ్రెస్ కీలక పదవి
కమ్యూనికేషన్ వింగ్ బాధ్యతలు
Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు మొదలయ్యాయి. ఓ వైపు ఈడీ నోటీసులతో ఆందోళన బాట పట్టింది ఆ పార్టీ. ఇక ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ దేశంలో అన్ని పార్టీల కంటే సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది.
దేశ వ్యాప్తంగా ఏ క్షణం ఏం జరిగినా వెంటనే స్పందించడం ఆ పార్టీకి బిగ్ అడ్వాంటేజ్ గా మారింది. ఇక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల పరంగా ఆఖరున ఉంది.
ఆ పార్టీకి చెందిన నేతలు రాజకీయ రంగంలో అనుభవం కలిగినప్పటికీ కాషాయ దాడిని ఎదుర్కోవడంలో వెనుకంజలో ఉన్నారు. పార్టీ పరంగా నలుగురైదుగురు నేతలు తప్ప మిగతా వారు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇదే విషయాన్ని పాయింట్ అవుట్ చేశారు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. దేశాన్ని మార్చగలం కానీ కాంగ్రెస్ పార్టీని మార్చలేం అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
చేసిన 10 శాతం ఉంటే దానిని 100 శాతం జరిగినట్లుగా నమ్మిస్తోంది బీజేపీ. దేశ ప్రజలను మోదీ ప్రభావితం చేసినంతగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకత్వం చేయలేక పోతోంది.
దీంతో పార్టీకి భారీ నష్టం చేకూరుతోంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సీనియర్ నాయకుడు జైరాం రమేష్(Jairam Ramesh) కు కీలక బాధ్యతలు అప్పగించింది.
ఆంగ్ల భాషపై ఆయనకు అపారమైన పట్టుంది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ , పబ్లిసిటీ అండ్ మీడియా, సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా నియమించింది ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ.
Also Read : అగ్నిపథ్ పథకం కాంగ్రెస్ ఆగ్రహం