Swiss Bank Indians : ‘స్విస్’ లో భారీగా పెరిగిన నల్ల ధనం
రూ. 30 వేల కోట్లు భారతీయులవే
Swiss Bank Indians : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటలు నీటి మీద రాతలయ్యాయి. ఆరు నూరైనా సరే నల్లధనం రప్పిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. యావత్ భారత జాతి సాక్షిగా ప్రమాణం చేశారు.
కానీ చెప్పిన మాటల్ని నిలబెట్టుకోలేక పోయారు. తాము పవర్ లోకి వస్తే స్విస్ బ్యాంకులో భారతీయులు(Swiss Bank Indians) దాచుకున్న నల్ల ధనాన్ని తీసుకు వస్తానని చెప్పింది ఏనాడో మరిచి పోయారు.
ప్రస్తుతం మన్ కీ బాత్ పేరుతో కథలు చెప్పడం ప్రారంభించారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. నల్లధనం తీసుకొస్తాం. ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15,00,000 లక్షలు జమ చేస్తామంటూ హామీ ఇచ్చారు.
ఎనిమిదేళ్లు గడిచినా ఈరోజు వరకు ఒక్క పైసా రాలేదు. కానీ భారతీయుల ఖాతాల్లోంచి పన్నులు, ధరల రూపేణా పిండుతున్నారు. మోదీ ప్రభుత్వం వ్యాపారులకు లబ్ది చేకూర్చేలా, ఆదాయం పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా అదానీ గ్రూప్ కు పవన విద్యుత్ ప్రాజెక్టు ఇవ్వాలంటూ సాక్షాత్తు ప్రధాని మోదీ దేశ అధ్యక్షుడు రాజపక్సెపై ఒత్తిడి తెచ్చారంటూ ఆ దేశానికి సిఇసీ చైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇక స్విస్ బ్యాంక్ లో ఒక్క ఏడాదే ఏకంగా భారతీయుల నల్ల ధనం 50 శాతం పెరగడం విశేషం. అంటే మన రూపాయాల్లో రూ. 30 వేల కోట్లు అన్నమాట. గతంలో కంటే వేగంగా పెరగడం విస్తు పోయేలా చేసింది.
దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు , ఇతర పేపర్స్ వాల్యూ 2021లో 3.83 బిలియన్ల స్వీస్ ప్రాంక్ లుగా ఉన్నట్లు స్విస్ బ్యాంకు(Swiss Bank Indians) తాజాగా ప్రకటించింది.
దీని వాల్యూ రూ. 30, 500 కోట్లు. ఇక 2020లో రూ. 20,700 కోట్లు ఉంటే రూ. 10 వేల కోట్లు పెరిగింది.
Also Read : కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి