Stop Adani : ఒప్పందం అక్ర‌మం అదానీపై ప్ర‌జాగ్ర‌హం

శ్రీ‌లంక‌లో పెల్లుబికిన ప్ర‌జా ఉద్య‌మం

Stop Adani : శ్రీ‌లంక‌లోని మ‌న్నార్ లో ప‌వ‌న విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూప్(Stop Adani) కు అప్ప‌గించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ , దేశ అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం కుదిరింద‌ని, దీని వెనుక ఎన్ని కోట్లు చేతులు మారాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

అదానీకి అప్ప‌గించడాన్ని తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేశారు. పెద్ద ఎత్తున రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. శ్రీ‌లంక ప్ర‌భుత్వానికి, గౌత‌మ్ అదానీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ప్రెసిడెంట్, పీఎంల మ‌ధ్య లోపాయికారి ఒప్పందం మేర‌కే ఈ త‌తంగం న‌డిచిందంటూ నిప్పులు చెరిగారు. దీన్ని ర‌ద్దు చేసి తిరిగి బిడ్డింగ్ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

దేశ అధ్య‌క్షుడు అయినంత మాత్రాన రూల్స్ కు విరుద్దంగా వేలం పాట లేకుండానే ఎలా కంపెనీకి అప్ప‌గిస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇలాంటి త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల‌నే దేశం ఈ స్థితికి చేరింద‌ని, దివాలా అంచ‌ను నిల‌బ‌డిందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

అదానీ సంస్థ‌కు మేలు చేకూర్చేందుకే శ్రీ‌లంక పార్ల‌మెంట్ ఎల‌క్ట్రిసిటీ చ‌ట్టానికి స‌మ‌ర‌ణ‌లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఈ ఆందోళ‌న పీపుల్స్ ప‌వ‌ర్ సివిల్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది.

తాము విద్యుత్ ప్రాజెక్టును వ్య‌తిరేకించ‌డం లేదు. కానీ అక్ర‌మంగా క‌ట్ట‌బెట్ట‌డాన్ని మాత్ర‌మే త‌ప్పు ప‌డుతున్నామ‌ని ఆందోళ‌న‌కారులు స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ప్రాజెక్టు అప్ప‌గించేలా భార‌త ప్ర‌ధాని మోదీ దేశ అధ్య‌క్షుడిపై ఒత్తిడి తెచ్చారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సిఈసీ చైర్మ‌న్. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ ప్రెసిడెంట్ ఖండించారు. చైర్మ‌న్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.

Also Read : ‘స్విస్’ లో భారీగా పెరిగిన‌ న‌ల్ల ధ‌నం

Leave A Reply

Your Email Id will not be published!