ADR : పేరుకే ‘పెద్ద‌లు’ నేర చరిత్ర‌లో ముదుర్లు

కొత్త‌గా ఎంపికైన రాజ్య‌స‌భ ఎంపీల్లో 40 శాతం

ADR : ఒక‌ప్పుడు దేశంలో పెద్ద‌ల స‌భ (రాజ్య‌స‌భ‌) అంటే గౌర‌వం ఉండేది. స‌మాజానికి మేలు చేకూర్చేలా మేధావులు, క‌ళాకారులు, నిబ‌ద్ద‌త క‌లిగిన సామాజిక‌వేత్త‌లు, నిబ‌ద్ద‌త క‌లిగిన మేధావుల్ని పంపించే వారు.

వారు దేశాభివృద్ధికి కీల‌క సూచ‌న‌లు చేసేవారు. కానీ సీన్ మారింది. రాజ‌కీయాలు భ్ర‌ష్టు ప‌ట్టి పోయాయి. నేరం, రాజ‌కీయం, అక్ర‌మం ఒకే చోటుకు చేరాయి. దీంతో నేర చ‌రిత్ర క‌లిగిన వారే అధికంగా పెద్ద‌ల స‌భ‌కు వెళ్ల‌డం ఆనవాయితీగా మారింది.

ఇక దేశంలో ప్ర‌తి ఏటా ప్ర‌జా ప్ర‌తినిధుల‌లో నేర‌, అవినీతి , ఆస్తుల చిట్టాలు వెల్ల‌డిస్తుంది నేష‌న‌ల్ ఎల‌క్ష‌న్ వాచ్, అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రైట్స్(ADR)  (ఏడీఆర్ ) వెల్ల‌డిస్తాయి.

తాజాగా దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల‌లో 57 రాజ్య‌స‌భ ఎంపీ స్థానాల‌కు ఎన్నిక‌లు ముగిశాయి. ఇందులో 41 మంది ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. 16 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.

కొత్త‌గా ఎంపికైన ఎంపీల‌లో 40 శాతం మందికి నేర చ‌రిత్రుంద‌ని తేల్చాయి. 12 మంది ఎంపీల‌పై సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు పెండింగ్ లో ఉన్న‌ట్లు వెల్ల‌డించాయి. ఈ విష‌యాల‌ను నామినేషన్లు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ల ఆధారంగా సేక‌రించాయి.

23 మంది ఎంపీల‌పై నేర సంబంధ కేసులు ఉన్నాయి. 12 మందిపై హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం, చోరీ, మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు కేసులు న‌మోద‌య్యాయి.

పార్టీల వారీగా చూస్తే 22 మంది బీజేపీ ఎంపీల‌కు గాను 9 మందికి, 9 మంది కాంగ్రెస్ ఎంపీల‌లో న‌లుగురికి నేర చ‌రిత్ర ఉన్న‌ట్లు పేర్కొన్నాయి.

ఇక ఆర్జేడీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు, వైసీపీ , డెంకే, ఏఐడీఎంకే, ఎస్పీ, ఎస్ హెచ్ ఎస్ , ఇండిపెండెంట్ నుంచి ఎంపికైన ఎంపీల‌కు నేర చ‌రిత్ర ఉంద‌ని వెల్ల‌డించాయి.

Also Read : జైరాం ర‌మేశ్ కు కాంగ్రెస్ కీల‌క ప‌ద‌వి

Leave A Reply

Your Email Id will not be published!