Ferdinando CEB : ఫెర్డినాండో త‌ప్పుకున్నాడా త‌ప్పించారా

అదానీపై వెల్లువెత్తిన ప్ర‌జాగ్ర‌హం

Ferdinando CEB : ఎవ‌రీ ఫెర్డినాండో అనుకుంటున్నారా. శ్రీ‌లంక దేశంలో విద్యుత్ రంగంపై అపారామైన ప‌ట్టు క‌లిగిన వ్య‌క్తి. అంతేనా ఇటీవ‌ల ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.

ఎందుకంటే ఆయ‌న ఏకంగా భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దేశ అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స్ పై మోదీ ఒత్తిడి తెచ్చార‌ని, అదానీ గ్రూప్ కు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారంటూ వాపోయార‌ని వెల్ల‌డించారు.

బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ఇది దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. చివ‌ర‌కు డ్యామేజ్ అవుతుంద‌ని గ్ర‌హించిన శ్రీ‌లంక ప్ర‌భుత్వం వెంట‌నే రంగంలోకి దిగింది. సాక్షాత్తు అధ్య‌క్షుడు ఖండించాల్సి వ‌చ్చింది.

కానీ ఏమైందో ఏమో కానీ తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు సిలోన్ ఎల‌క్ట్రిసిటీ బోర్డు చైర్మ‌న్ ఫెర్డినాండో. ఆయ‌న‌ను త‌ప్పుకునేలా దేశ అధ్య‌క్షుడు, ప్ర‌ధాన‌మంత్రి ఒత్తిడి తెచ్చార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మ‌న్నార్ ప‌వ‌న విద్యుత్తు ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు ఎలా అప్పగిస్తారంటూ జ‌నం రోడ్ల పైకి వ‌చ్చారు. స్టాప్ అదానీ అంటూ ప్ల కార్డుల‌తో నినాదాలు చేశారు. ఎలాంటి బిడ్డింగ్ లేకుండా అదానీ కంపెనీకి ఎలా అప్ప‌గిస్తారంటూ శ్రీ‌లంక ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇప్ప‌టికే ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంద‌ర్భంగా ఫెర్డినాండో(Ferdinando CEB) రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో అదానీ గ్రూపును గుర్తించాల‌ని దేశ అధ్య‌క్షుడి ఆదేశాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు.

ఈ వివాదంపై ప్ర‌ధాన మంత్రి మోదీ స్పందించ లేదు. ఇదిలా ఉండ‌గా అధ్య‌క్షుడి నిర్వాకం, పీఎం జోక్యం కార‌ణంగానే ఫెర్డినాండో(Ferdinando CEB) త‌ప్పుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : ఒప్పందం అక్ర‌మం అదానీపై ప్ర‌జాగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!