Agnipath Protest : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తం
తెలంగాణాకు పాకిన అగ్నిపథ్ నిరసన
Agnipath Protest : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్(Agnipath Protest) స్కీం పై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిన్న మొన్నటి దాకా బీహార్ అట్టుడికి పోతే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పలు రైళ్లను తగులబెట్టారు. రాళ్లతో దాడులకు దిగారు. నిరుద్యోగులు భారీ ఎత్తున తరలి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అగ్నిపథ్ ఆందోళన(Agnipath Protest) హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తోంది. పరిస్థితి చేయి దాటింది. ఉత్తరాదిలో కంటే ఎక్కువగా హైదరాబాద్ ను ముంచెత్తింది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ప్లాట్ ఫారమ్ పై ఆగి ఉన్న రైళ్లపై కూడా దాడులకు దిగారు. పరిస్థితి ప్రస్తుతం కంట్రోల్ చేసే స్థితి లేదు. పెద్ద ఎత్తున చేరుకున్న నిరుద్యోగులు నిప్పులు చెరిగారు.
రైల్వే స్టేషన్ పోలీసులు చేతులెత్తేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైళ్లను నిలిపి వేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఆందోళన ఊహించని స్థాయిలో చేరుకుంది.
రైల్వే స్టేషన్ పోలీసులు, తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. అయినా ఆందోళన అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అగ్నిపథ్ స్కీంను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
రైళ్లకు నిప్పు పెట్టడం, రైళ్లపై రాళ్లు రువ్వడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా ఆర్మీ అభ్యర్థుల దాడి పలువురికి గాయాలయ్యాయి. 20 బైక్ లకు నిప్పంటించారు. గత మూడు గంటలకు పైగా రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ కొనసాగుతోంది.
Also Read : రైళ్ల ధ్వంసం ఎమ్మెల్వే వాహనంపై దాడి