Bandi Sanjay : తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఉద్రిక్తత అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) .
ముసుగులు ధరించి దాడులకు దిగబడ్డారు. రైళ్లు, ఆస్తులను ధ్వంసం చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పన్నిన కుట్రేనంటూ మండిపడ్డారు. నిలువరించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండి పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఈ విధ్వంసానికి ఒడిగట్టాయంటూ ఆరోపించారు బండి సంజయ్. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను తగులబెట్టారు ఆందోళనకారులు.
దాదాపు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. పరిస్థితి అదుపులోకి రాక పోవడంతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు చని పోయినట్లు సమాచారం.
8 మందికి పైగా గాయపడ్డారని వారిని ఆస్పత్రికి తరలించారని సమాచారం. కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంకు వ్యతిరేకంగా నిప్పులు చెరిగారు ఆందోళనకారులు.
కరోనా పేరుతో రెండేళ్ల పాటు ఉద్యోగాల భర్తీని నిలిపి వేశారని , మరి ఎన్నికలను ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఎవరో ఒకరు వచ్చి హామీ ఇచ్చేంత దాకా తాము కదిలే ప్రసక్తి లేదంటారు.
ఇదిలా ఉండగా సికింద్రాబాద్ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కిషన్ రెడ్డితో ఆరా తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇదిలా ఉండగా బండి(Bandi Sanjay) చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగాయి ఇతర పార్టీలు.
Also Read : అగ్నిపథ్ ఆగ్రహం సికింద్రాబాద్ రణరంగం