Presidential Polls : బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల ప్రచార కమిటీ డిక్లేర్
కన్వీనర్ గా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్
Presidential Polls : భారత దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగిసింది. కొత్త రాష్ట్రపతి ఎన్నిక(Presidential Polls) కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే తో పాటు విపక్షాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేసింది.
ఇంకా భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించ లేదు. ఇక రాష్ట్రపతి ఎన్నిక(Presidential Polls) కు సంబంధించి బీజేపీ ప్రచార ప్యానల్ ను ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ బీజేపీ ప్రచార నిర్వహణ కమిటీ కన్వీనర్ గా ఎంపికయ్యారు.
భారత తదుపరి రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ శుక్రవారం 14 మంది సభ్యులతో కూడిన ప్రచార నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. సింగ్
ఈ కమిటీకి బాధ్యత వహిస్తారు.
ఇదిలా ఉండగా జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జర్మనీకి వెళ్లే లోపు వచ్చే వారం బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. జూన్ 26 లోగా నామినేషన్ దాఖలు చేసే సమయానికి ఆయన హాజరు కావాలని భావిస్తున్నారు.
నామినేషన్లకు చివరి తేదీ జూన్ 29. జూలై 18న పోలింగ్ జరుగుతుంది. అదే నెల 21న ఎన్నికల ఫలితం ప్రకటిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఎన్డీయే అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు మంత్రులు, పార్టీ ప్రతినిధులతో కూడిన బీజేపీ కమిటీ ఏర్పాటు చేసింది.
ఇక ఈ ప్యానెల్ లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ , సర్వానంద సోనోవాల్ , అర్జున్ మేఘ్వాల్ , భారతి పవార్ ఉన్నారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, సిటీ రవి కో కన్వీనర్లుగా ఉన్నారని పార్టీ తెలిపింది. ఇందులో తరుణ్ చుగ్ , డికే అరుణ, రితురాజ్
సిన్హా, వి. శ్రీనివాసన్ , సంబిత్ పాత్ర, రాజ్ దీప్ రాయ్ కూడా ఉన్నారు.
Also Read : సీఎం సోదరుడి ఇంటిపై సీబీఐ దాడులు