KTR Modi : మోదీ ఇకనైనా కళ్లు తెరవండి – కేటీఆర్
నిరుద్యోగానికి పరాకాష్ట ఈ విధ్వంసం
KTR Modi : దేశంలో 60 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు కేంద్రంలో కొలువు తీరిన ప్రభుత్వానికి స్పష్టమైన విధానం అంటూ లేకుండా పోయింది. ఎలాంటి విజన్ లేకుండా ఉండడం వల్లనే ఇలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి.
కేంద్ర సర్కార్ ప్రకటించిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం ఎందుకు తీసుకు వచ్చారో ఈరోజు వరకు దేశానికి చెప్పలేదు. దేని కోసం ప్రవేశ పెట్టారో మోదీకి తెలియదు. ప్రతిపక్షాలతో సమావేశం ఏమైనా ఏర్పాటు చేశారు.
అదీ లేదు. ఆఘమేఘాల మీద 10 లక్షల కొలువులు భర్తీ చేస్తామన్నారు. మరి నిరంతరం దేశ రక్షణలో కీలక భాగస్వామ్యం వహించే సాయుధ దళాలలో కాంట్రాక్టు వ్యవస్థను ఎందుకు ప్రవేశ పెట్టాలని అనుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు రాష్ట్ర మంత్రి కేటీఆర్(KTR Modi).
ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మోదీని నిలదీశారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని, అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలు, విధ్వంసాలు నిదర్శనమని స్పష్టం చేశారు.
ఇకనైనా ప్రధాన మంత్రి మేల్కోవాలి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బేషరతుగా నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్న అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికే రైతుల ఆందోళనతో చేతులు కాల్చుకున్నారని, చట్టాలను వెనక్కి తీసుకున్నారని, దేశం అగ్నిగుండం కాక ముందే ప్రధాని తన నిర్ణయాన్ని రద్దు చేసుకుంటే బెటర్ అని కేటీఆర్(KTR Modi) సూచించారు.
మొదట రైతులతో ఆడుకున్నారు ఇప్పుడు జవాన్లతో ఆడుకోవడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. నో ర్యాంక్ నో పెన్షన్ గా మారిందంటూ ఎద్దేవా చేశారు.
Also Read : ప్రభుత్వ వైఫల్యం వల్లే విధ్వంసం – బండి