Bhagwant Mann : అగ్నిపథ్ ను ఆపాలంటూ సీఎంకు విన్నపం
తాను కూడా ఒప్పుకోనన్న భగవంత్ మాన్
Bhagwant Mann : దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంపై నిరసనలు హోరెత్తాయి. ఆందోళనలు మిన్నంటాయి. ప్రతి చోటా వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రభుత్వ ఆస్తులపై దాడులు కొనసాగుతున్నాయి.
అయినా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు బేషరతుగా అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తున్నాయి.
ఇదే సమయంలో దేశానికి నిరంతరం కాపలా కాసే జవాన్ల భర్తీకి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలే తప్పా తాత్కాలిక పద్దతిన కాదంటూ నిప్పులు చెరిగారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann).
ఈ మేరకు ఆయన అగ్నిపథ్ స్కీం ఎంత మాత్రం దేశ యువతకు మంచిది కాదని, సరిపోదంటూ పేర్కొన్నారు. ఇందులో భాగంగా భగవంత్ మాన్(Bhagwant Mann) ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సుదీర్ఘ లేఖ కూడా రాశారు.
తాజాగా పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆసక్తిని రేపింది. సీఎం వాహనం బయలు దేరుతుండగా ఓ యువకుడు తనతో మాట్లాడాలంటూ కోరాడు.
సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం భగవంత్ మాన్ వారిని వారించారు. ఆ యువకుడితో కరచాలనం చేశాడు. తాను కూడా మీతో పాటే అగ్నిపథ్ భర్తీ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
తాను ఒప్పుకునే ప్రసక్తి లేదని మీకు అండగా ఉంటానని చెప్పారు. శాంతియుతంగా నిరసన చెప్పాలి కానీ హింసకు దిగవద్దంటూ సూచించారు. ప్రస్తుతం భగవంత్ మాన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read : అగ్నిపథ్ స్కీంను విరమించుకోండి – సీఎం