PM Modi : చెత్త‌ను శుభ్రం చేసిన ప్ర‌ధాని మోదీ

స్వ‌చ్ఛ భార‌త్ దేశానికి ఆద‌ర్శం

PM Modi : స్వ‌చ్చ భార‌త్ దేశానికి ఆద‌ర్శంగా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) . స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చెత్త‌ను ఎత్తి వేసి శుభ్రం చేశారు ప్ర‌ధాని.

ప్ర‌స్తుతం ఈ స‌న్నివేశం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సెంట్ర‌ల్ ఢిల్లీలోని ఆదివారం ఐటీపీఓ సొరంగం తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా మోదీ సాంప్ర‌దాయ క‌ళ‌ల కు సంబంధించిన పోస్ట‌ర్ వ‌ద్ద పేరుకుని పోయిన చెత్త‌ను తొల‌గించారు.

తాగి ప‌డేసిన బాటిళ్ల‌ను తొల‌గించారు. దీంతో సిబ్బంది అప్ర‌మ‌త్తం అయ్యారు. ప్ర‌తి ఒక్క‌రు శుభ్ర‌త‌ను పాటించాల‌ని సూచించారు మోదీ.

త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స్వ‌చ్ఛ భార‌త్ లేదా క్లీన్ ఇండియా మిష‌న్ కార్య‌క్ర‌మాన్ని వ్య‌క్తిగ‌తంగా ఎలా అమ‌లు చేయాల‌నేది ఉదాహ‌ర‌ణగా నిలుస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోదీ(PM Modi)  చెత్త‌ను తొల‌గించ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్. జీవ‌న విధానంలో పరిశుభ్ర‌త ఎంత ప్రాముఖ్య‌త వహిస్తుందో త‌న చేత‌ల ద్వారా మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ చేశార‌ని పేర్కొన్నారు.

ఈ సొరంగం నిర్మాణానికి ఎంద‌రో అడ్డంకులు క‌ల్పించారు. కానీ ప్ర‌ధాని మొక్క‌వోని సంక‌ల్పంతో ఇవాళ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చింద‌ని కేంద్ర మంత్రి తెలిపారు.

ఇదిలా ఉండ‌గా స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ ను ప్ర‌ధాని మ‌మోదీ అక్టోబ‌ర్ 2, 2014 లో ప్రారంభించారు దేశంలో.

ఈ కార్య‌క్ర‌మం కింద అన్ని గ్రామాలు, గ్రామ పంచాయ‌తీలు, జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 100 మిలియ‌న్ల‌కు పైగా మ‌రుగుదొడ్ల‌ను నిర్మించామ‌న్నారు. ఇది దేశ చ‌రిత్ర‌లో ఓ అరుదైన రికార్డుగా మిగిలి పోతుంద‌న్నారు.

Also Read : నిర‌స‌న‌కారుల‌పై బుల్డోజ‌ర్లు ఎక్క‌డ‌

Leave A Reply

Your Email Id will not be published!