V Muraleedharan : అగ్నిపథ్ స్కీం అద్బుత పథకం – మంత్రి
కేంద్ర సహాయ శాఖ మంత్రి వి. మురళీధరన్
V Muraleedharan : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు మిన్నంటాయి. రైళ్లు తగలబడి పోతున్నాయి. బస్సుల అద్దాలు ధ్వంసమవుతున్నాయి.
కేంద్ర సర్కార్ దీనిపై పునరాలోచనలో పడింది. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్(V Muraleedharan) షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే తాము తీసుకు వచ్చిన అగ్ని పథ్ స్కీం ను యువతీ యువకులు సరిగా అర్థం చేసుకోలేక పోయారని పేర్కొన్నారు. అందువల్లే యువకులు రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు.
దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నట్టు అనుమానం కలుగుతోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి. ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు మంత్రి.
అంతకంటే ఎక్కువగా అగ్ని వీర్ లకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాటిని తెలుసుకుని ఉంటే ఇలా బయటకు రారని, నిరసనలు, ఆందోళనలు చేపట్టరన్నారు వి. మురళీధరన్(V Muraleedharan).
ఆదివారం కేంద్ర సహాయ మంత్రి కేరళ లోని తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా అగ్నిపథ్ స్కీంను అర్థం చేసుకుని కేంద్ర సర్కార్ కు సహకరించాలని కోరారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో 17 నుంచి 21 సంవత్సరాల మధ్య వయసు గల యువకులను రిక్రూట్ మెంట్ చేసే పథకం గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు వి. మురళీధరన్.
విషయం అర్థం చేసుకోక పోవడం వల్ల వచ్చిందే తప్పా మరోటి కాదన్నారు. యువకుల భవిష్యత్తు, సాయుధ బలగాల సంక్షేమం, దేశ భద్రత విషయంలో ప్రధాన మంత్రి ఎక్కడా రాజీ పడరని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
Also Read : డ్యూటీ మేజిస్ట్రేట్ ఓదార్పు వైరల్