LT Gen Anil Puri : అపోహలు వీడండి ‘అగ్నిపథ్’ లో చేరండి
లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి ప్రకటన
LT Gen Anil Puri : కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీంపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ఆ స్కీం వల్ల ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు మిలటరీ వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి(LT Gen Anil Puri).
ఆదివారం వివిధ సాయుధ దళాల అధిపతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. యువకుల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకే దీనిని కేంద్రం తీసుకు వచ్చిందని స్పష్టం చేశారు.
ఈ పథకం పట్ల సరైన అవగాహన లేక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అగ్నిపథ్ ఎంత గొప్ప పథకమో వివరించారు.
ఈ సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరితో(LT Gen Anil Puri)పాటు ఎయిర్ మార్షల్ ఎస్కే ఝా, వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, అడ్మిరెంట్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొనప్ప పాల్గొన్నారు.
75 శాతం మంది పదవీ విరమణ చేయక ముందే రిక్రూట్ మెంట్లు నాలుగు సంవత్సరాల పాటు పని చేస్తాయన్నారు అనిల్ పూరి. ఇది రెండేళ్ల ప్రణాళిక ఫలితమని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం దీనికి ఓకే చెప్పిందన్నారు. సాయుధ దళాల వయసు తగ్గించేందుకు, పోరాట సన్నద్దతను పెంచేందుకు రూపొందించడం
జరిగిందని స్పష్టం చేశారు.
రాబోయే ఐదేళ్లలో సైనికులు 50,000 నుంచి 60,000 మధ్య ఉంటారు. ఇది 90,000 నుండి 1,00,000 దాకా పెరుగుతుందన్నారు. అగ్నిపథ్ లో చేరిన వారిని అగ్ని వీర్స్ అని పిలుస్తారు.
మొదటి ఏడాది నెలకు రూ. 30,000 వస్తాయి. నాలుగో సంవత్సరంలో నెలకు రూ. 40,000 అందుతాయి. మొత్తం చెల్లింపు దాదాపు రూ. 16.7 లక్షలు అవుతుంది.
సేవా నిధి ప్యాకేజీ కింద రూ. 11.71 లక్షలు వడ్డీ తో సహా చెల్లించడం జరుగుతుందన్నారు. మొత్తంగా ఒక్కో అగ్ని వీర్ కు రూ. 23.34 లక్షలు అందుతాయన్నారు.
ఒక వేళ అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి రూ. 1కోటి చెల్లిస్తామన్నారు. సాయుధ దళాల భర్తీ ప్రక్రియలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు.
Also Read : అగ్నిపథ్ స్కీం వెనక్కి తీసుకోండి – ఓవైసీ