Dinesh K Tripathi : ‘అగ్నివీర్స్’ రిక్రూట్మెంట్ షెడ్యూల్ డిక్లేర్
నేవీ చీఫ్ ఆఫ్ పర్సనల్ వైస్ అడ్మిరల్ త్రిపాఠి
Dinesh K Tripathi : ఓ వైపు అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇంకో వైపు భారీ ఎత్తున యువకులు
రోడ్లపైకి వచ్చారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కానీ మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
తాజాగా సాయుధ దళాలు అగ్నివీర్స్ ఎంపికకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించాయి. ఈ మేరకు ఈనెల 25 నాటికి నౌకాదళ ప్రధాన కార్యాలయం రిక్రూట్మెంట్ కోసం విస్తృత మార్గదర్శకాలు జారీ చేస్తుందని ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ పర్సనల్ వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి(Dinesh K Tripathi) ప్రకటించారు.
వచ్చే నవంబర్ 21 నాటికి అగ్నివీర్స్ కు సంబంధించి మొదటి బ్యాచ్ రిక్రూట్ లు శిక్షణలో చేరతారని తెలిపారు. ఈ పథకం కింద పురుషులు, మహిళలను అగ్ని వీర్స్ గా నియమించుకుంటామని చెప్పారు.
వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి(Dinesh K Tripathi) ఆదివారం మీడియాతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 24 నుండి ప్రారంభం అవుతుందన్నారు. మొదటి దశ రిక్రూట్ కమెంట్ కోసం ఆన్ లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుండి స్టార్ట్ చేస్తామని చెప్పారు.
డిసెంబర్ 30 నాటికి మొదటి బ్యాచ్ లో ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇస్తామన్నారు. భారత సైన్యం ఈనెల 20న సోమవారం అగ్నిపథ్ వీర్స్
ఎంపికకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేస్తామన్నారు.
జూలై 1 నుండి వివిధ రిక్రూట్ మెంట్ యూనిట్ల ద్వారా తదుపరి నోటిఫికేషన్లు జారీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. 25 వేల మందితో
కూడిన మొదటి బ్యాచ్ డిసెంబర్ మొదటి, రెండో వారంలో శిక్షణలో చేరుతుందన్నారు.
రెండో బ్యాచ్ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం అవుతుందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ , అక్టోబర్ లలో దేశ వ్యాప్తంగా మొత్తం 83 రిక్రూట్ మెంట్
ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ పొనప్ప తెలిపారు.
Also Read : అపోహలు వీడండి ‘అగ్నిపథ్’ లో చేరండి