Spice Jet Plane : పక్షి ఢీకొట్టడం వల్లే ఘటన – స్పైస్ జెట్
పాట్నాలో ల్యాండ్ అయిన విమానం
Spice Jet Plane : స్పైస్ జెట్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుండి బయటు దేరిన ఈ విమానం లో మంటలు చెలరేగడంతో దానిని అత్యవసరంగా పాట్నా ఎయిర్ పోర్ట్ లో దించాల్సి వచ్చింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనికి సంబంధించి స్పైస్ జెట్ స్పందించింది. ఎలా మంటలు వ్యాపించాయనే దానిపై క్లారిటీ ఇచ్చింది.
కాగా ఫ్లైట్ కు సంబంధించి కాక్ పిట్ లో మంటలు చెలరేగినట్లు ఎలాంటి సూచనలు లేవన్నారు. భూమిపై ఉన్న కొందరు వ్యక్తులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) మాత్రమే దీనిని చూశారని తెలిపారు.
ఢిల్లీ బయలు దేరిన స్పైస్ జెట్ విమానం(Spice Jet Plane) ఇంజిన్ ను పక్షి ఢీకొట్టిందని, దీని వల్ల విమానానికి సంబంధించిన మూడు ఫ్యాన్ బ్లేడ్ లు దెబ్బతిన్నాయని సంబంధిత అధికారి వెల్లడించారు.
ఈ విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో ఏ ఒక్కరూ గాయపడలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భూమిపై స్థానికులు కొందరు చిత్రీకరించిన వీడియోలలో విమానం ఎడమ ఇంజిన్ నుండి నిప్పు రవ్వలు వెలువడుతున్నట్లు కనిపించాయి.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేశారు స్పైస్ జెట్(Spice Jet Plane) అధికారి. సాధారణంగా విమానం టేకాఫ్ తీసుకుంది. ఎడమ వైపున చిన్న చప్పుడు వినిపించింది.
చిన్న చప్పుడు అంటే సాధారణంగా అనుమానాస్పదంగా ఉంటుంది. కానీ కాక్ పిట్ సూచన లేదన్నారు. కొద్ది సేపటికే ఏటీసీ నుండి కాల్ వచ్చింది.
వారు ఎడమ ఇంజిన్ నుండి పొగ , మంటలను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఏటీస నుండి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. సమీప ఎయిర్ పోర్ట్ లో విమానం దించండి అని , ఆ మేరకు సురక్షితంగా పాట్నా ఎయిర్ పోర్ట్ లో దించాల్సి వచ్చిందన్నారు.
Also Read : డ్యూటీ మేజిస్ట్రేట్ ఓదార్పు వైరల్