Rahul Gandhi : ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

వ‌రుస‌గా నాలుగో రోజు హాజ‌రు

Rahul Gandhi : నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాలుగో రోజు ఢిల్లీలో ఈడీ ముందు హాజ‌రు అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు హాజ‌ర‌య్యారు.

దాదాపు 26 గంట‌ల‌కు పైగా రాహుల్ గాంధీని ఈడీ విచార‌ణ చేప‌ట్టింది. శుక్ర‌వారం రోజు హాజ‌రు కావాల‌ని ఈడీ ఆదేశించింది.

అయితే గంగా రామ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న త‌న త‌ల్లి, ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని చూసుకోవాల్సి ఉందని, తాను హాజ‌రు కాలేనంటూ ఈడీకి తెలిపారు.

దీంతో రాహుల్ గాంధీకి మిన‌హాయింపు ఇచ్చింది. సోమ‌వారం ఈడీ ముందుకు వెళుతున్న స‌మ‌యంలో దేశ రాజ‌ధానిలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి.

గ‌త వారం మూడు సార్లు ప్ర‌శ్నించింది. ప‌లు ప్ర‌శ్నలు సంధించింది. నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి రూ. 90 కోట్లు చేతులు మారాయంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయ‌వాది సుబ్ర‌మ‌ణ్య స్వామి సీబీఐకి ఫిర్యాదు చేశారు

. ఈ మేర‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసింది ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి.

ఇదిలా ఉండ‌గా క‌రోనా ఎఫెక్ట్ కావ‌డంతో సోనియా గాంధీ తాను రాలేనంటూ ఈడీకి తెలిపింది. ఈనెల 23న హాజ‌రు కావాలని ఈడీ స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిర‌సిస్తూ కాంగ్రెస పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.

Also Read : కీల‌క ప‌ద‌వుల ఎంపికపై కాంగ్రెస్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!