Mallikarjun Kharge : సాయుధ దళాల చీఫ్ లు వివరణ ఇస్తారా
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge : భారత దేశ చరిత్రలో మొదటిసారి సాయుధ దళాల అధిపతులు అగ్నిపథ్ స్కీం విషయంలో ముందుకు రావడాన్ని తప్పు పట్టారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge).
ఇది పూర్తిగా కేంద్ర సర్కార్ వైఫల్యమని కానీ వారెందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. త్రివిధ దళాధిపతులు వివరణ ఇవ్వడం మంచి పద్దతి కాదన్నారు.
అసలు ఈ స్కీం ప్రవేశ పెట్టడం వల్ల మీరు ఈ దేశానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. సోమవారం మల్లికార్జున ఖర్గే ఆర్మీ చీఫ్స్ ఈ పథకం గురించి చెప్పడాన్ని తప్పు పట్టారు.
దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అయినా బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి ఇప్పటి వరకు నోరు మెదపక పోవడం దారుణమని ఆరోపించారు ఖర్గే. ఆయన తీవ్ర స్థాయిలో ప్రధానిపై ఫైర్ అయ్యారు. నాలుగేళ్ల తర్వాత అగ్నిపథ్ లో పని చేసిన వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.
అగ్నిపథ్ స్కీంను ప్రవేశ పెట్టేకంటే ముందు మీరు సాయుధ దళాల చీఫ్ లు, రక్షణ రంగ నిపుణులతో చర్చించారా అని ప్రశ్నించారు. ప్రత్యేకించి విపక్షాలతో కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా చడీ చప్పుడు లేకుండా ప్రకటిస్తే ఎలా అని నిలదీశారు ఖర్గే(Mallikarjun Kharge).
ఇది పూర్తిగా మోదీ దుందుడుకు నిర్ణయం తప్ప యువతకు మేలు చేసే పథకం అయితే కాదన్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించిన సాగు చట్టాల విషయంలో ఇలాగే చేశారు.
ఆ తర్వాత చేతులు కాల్చుకున్నారు. ఇప్పటికైనా తప్పును గుర్తించి అగ్నిపథ్ ను రద్దు చేయడమే ఉత్తమమని సూచించారు.
Also Read : బిగ్ డీల్ పై ఎయిర్ ఇండియా ఫోకస్