PM Yoga Awards 2021 : పీఎం యోగా అవార్డులు డిక్లేర్
జాబితాలో ప్రముఖులు..సంస్థలు
PM Yoga Awards 2021 : భారత దేశం మొదట ప్రపంచానికి యోగాను అందించింది. ఉపనిషత్తుల్లో, వేదాల్లో యోగాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. యోగా అంటేనే పతంజలి. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కొలువు తీరాక దేశంలో యోగాకు ప్రాధాన్యత పెరిగింది.
యోగాను జీవితంలో ఓ భాగం చేయాలని సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సక్సెస్ అయ్యారు కూడా. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా యోగాను అనుసరిస్తున్న వారు కోట్లల్లో ఉన్నారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా 2021 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పీఎం యోగా అవార్డులను (PM Yoga Awards 2021) ప్రకటించింది ఎప్పటిలాగే. ప్రతి ఏటా కేంద్రం యోగాలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు అందజేస్తోంది.
యోగా అభివృద్ధి, ప్రచారంలో అత్యుత్తమ సహకారం అందించినందుకు ప్రధానమంత్రి అవార్డును ప్రకటించారు. భిక్కు సంఘ సేన లేహ్ , మార్కస్ వినిసియస్ రోజో రోడ్రిగ్స్ , సావో పాలో తో పాటు ది డివైన లైఫ్ సొసైటీ , బ్రిటీష్ వీల్ ఆఫ్ యోగా సంస్థలకు ఈ పురస్కారాలు దక్కాయి.
ఇదిలా ఉండగా 21 జూన్ 2016లో చండీగఢ్ లో 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా అభివృద్ధి, ప్రమోషన్ లో అత్యుత్తమ సహకారం అందించినందుకు అవార్డులు ప్రకటించారు.
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అవార్డుల మార్గదర్శకాలు రూపొందించింది. ఇంటర్నేషనల్ ఇండివిడ్యువల్ , ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ , నేషనల్ ఇండివిడ్యువల్ , నేషనల్ ఆర్గనైజేషన్ పేరుతో నాలుగు కేటగిరీల కింద నామినేషన్లు పరిగణలోకి తీసుకుంది.
ఒక్కో వ్యక్తికి, సంస్థకు సర్టిఫికెట్ తో పాటు రూ. 25 లక్షల క్యాష్ ప్రైజ్ అందజేస్తారు.
Also Read : యోగా సాధనం ప్రపంచ శాంతికి మార్గం – మోదీ