Amit Shah JP Nadda : ‘వెంకయ్య’తో జేపీ..అమిత్ షా భేటీ
రాష్ట్రపతి రేసులో ఉన్నట్టా లేనట్టా
Amit Shah JP Nadda : దేశ వ్యాప్తంగా తదుపరి రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగిసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
ఈనెల 15 నుంచి నామినేషన్లను స్వీకరిస్తోంది. కానీ ఇప్పటి వరకు అటు మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ కానీ ఇటు విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థి విషయంలో క్లారిటీ రాలేదు.
ఇవాళ బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని సమాచారం. ఆ పార్టీ నుంచి ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుతో పాటు తమిళిసై సౌందర రాజన్ , ఇతర గవర్నర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక ఉమ్మడి అభ్యర్థిగా విపక్షాల నుంచి ఇప్పటి వరకు మూడు పేర్లను ప్రతిపాదించారు ఆయా పార్టీల తరపున మమతా బెనర్జీ. వారిలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కాగా రెండో వ్యక్తి మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, శరద్ పవార్ ను ప్రతిపాదించారు.
కానీ ఈ ముగ్గురు చేతులెత్తేశారు. తాజాగా మరో కొత్త పేరును ప్రతిపాదించారు దీదీ. వారెవరో కాదు భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఉన్న యశ్వంత్ సిన్హా. ఆయన గతంలో ఎన్నికల కంటే ముందు బీజేపీని వీడారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయన ఉమ్మడి పక్షాల తరపున రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా , పార్టీ చీఫ్ జేపీ నడ్డా(Amit Shah JP Nadda) ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలవడం రాజకీయ వర్గాలలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయననే ప్రతిపాదిస్తారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా