CBI Arrest : డ్రగ్ రెగ్యూలేటర్ ఆఫీసర్ ఈశ్వర్ రెడ్డి అరెస్ట్
అదుపులోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ
CBI Arrest : లంచం కేసులో ట్రాప్ ఆపరేషణ్ తర్వాత డ్రగ్ రెగ్యులేటర్ ఆఫీసర్ ఎస్. ఈశ్వర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్(CBI Arrest) చేసింది. అంతే కాకుండా ఈశ్వర్ రెడ్డికి లంచం ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినర్జీ నెట్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దినేష్ దువాను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది.
ఇంకా ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. టైప్ -1 నిర్వహణ కోసం బయోకాన్ బయోలాజిక్స్ ఉత్పత్తి
చేసిన ఇన్సు లిన్ ఆస్సార్ట్ ఇంజక్షన్ ఫేస్ 3 క్లినికల్ ట్రయల్ ను మాఫీ చేసేందుకు రూ. 4 లక్షలు స్వీకరించారని సీబీఐ వెల్లడించింది.
ఇది రూఢీ కావడంతో జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ ఎస్. ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. న్యూఢిల్లీ లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) లో విధులు నిర్వహిస్తున్నారు.
దినేష్ దువా ట్రాప్ ఆపరేషన్ లో లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. అవసరమైన పేపర్ వర్క్ పూర్తయ్యాక ఈశ్వర్ రెడ్డిని, దువాను అరెస్ట్
చేయడం జరిగిందని సీబీఐ(CBI Arrest) స్పష్టం చేసింది.
ఈ ఇద్దరితో పాటు బెంగళూరు లోని బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్. ప్రవీణ్ కుమార్ , ఢిల్లీలోని బయో
ఇన్ఫో వాట్ రసెర్చ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ , గుల్జిత్ సేథి, అసిస్టెంట్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ అనిమేష్ కుమార్ లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
నేర పూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ , అవినీతి పై ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసింది. బయోకాన్ బయో లాజిక్స్ కు మధ్య వర్తిగా వ్యవహరిస్తున్న సేథి
కంపెనీ నేషనల్ రెగ్యులేటరీ అఫైర్స్ హెడ్ ప్రవీణ్ కుమార్ , ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో కలిసి రెడ్డికి రూ. 9 లక్షలు లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారంటూ సీబీఐ ఆరోపించంది.
Also Read : యుద్దాలు ఎదుర్కోవాలంటే మార్పులు అవసరం