Odisha Murmu : ‘ముర్ము’ ఆదివాసీ ఆణిముత్యం – సీఎం
ప్రశంసించిన నవీన్ పట్నాయక్
Odisha Murmu : ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సంకీర్ణ సర్కార్ ఎన్డీయే ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము(Odisha Murmu)ను ఎంపిక చేయడం పట్ల స్పందించారు సీఎం.
గర్వించదగిన క్షణమని, ఆమె ఆదివాసీ సమూహానికి ఆణిముత్యమని ప్రశంసించారు. అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తిగా ఎంతో కష్టపడి పైకి వచ్చారని తెలిపారు. ముర్మును ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఒడిశా నుంచి రాష్ట్రపతి పదవిని అలంకరించిన మొదటి వ్యక్తి ఆమె అవుతుందన్నారు. ఇది దేశానికే కాదు తమ రాష్ట్ర ప్రజలందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు నవీన్ పట్నాయక్.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమెను ఎంపిక చేసే ముందు నాతో సంభాషించారు. నేను చాలా సంతోషానికి లోనయ్యాను. వెంటనే మీరు తీసుకున్న నిర్ణయానికి తాను సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నట్లు చెప్పానన్నారు సీఎం.
దేశంలో మహిళా సాధికారతకు ద్రౌపది ముర్ము(Odisha Murmu) ఆదర్శ ప్రాయంగా నిలుస్తారనడంలో సందేహం లేదన్నారు.
గతంలో దళితుడైన రామ్ నాథ్ కోవింద్ కు భారతీయ జనతా పార్టీ ప్రయారిటీ ఇచ్చిందని ప్రస్తుతం ఆదివాసీ బిడ్డకు అరుదైన గౌరవం దక్కేలా చేసిందని పేర్కొన్నారు నవీన్ పట్నాయక్.
మంగళవారం ముర్మును భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. ఇదిలా ఉండగా ద్రౌపది ముర్ము గతంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. అనంతరం కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.
బీజేపీలో కీలక పదవులు చేపట్టారు. జార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు.
Also Read : ద్రౌపది ముర్ముకు భారీ భద్రత