Draupadi Murmu Z Security : ద్రౌప‌ది ముర్ముకు భారీ భ‌ద్ర‌త

ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

Draupadi Murmu Z Security : భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ (ఎన్డీయే) ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన ఒడిశాకు చెందిన ద్రౌప‌ది ముర్ముకు భ‌ద్ర‌త పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ కింద సెక్యూరిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. బుధ‌వారం ఉద‌యం నుంచే ద్రౌప‌ది ముర్ముకు జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) సిబ్బందితో కేంద్ర స‌ర్కార్ 24 గంట‌ల పాటు జెడ్ కేట‌గ‌గిరీ సాయుధ భ‌ద్ర‌త‌(Draupadi Murmu Z Security )ను ఏర్పాటు చేసిన‌ట్లు హోం శాఖ తెలిపింది.

ఒడిశాకు చెందిన 64 ఏళ్ల ద్రౌప‌ది ముర్ము గ‌నుక రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైతే దేశంలోనే మొద‌టి గిరిజ‌న రెండో మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టిస్తారు. ఆమె ఆదివాసీ గిరిజ‌న తెగ‌కు చెందిన వారు. బ‌హుజ‌నుల అభివృద్ధి కోసం పాటు ప‌డ్డారు.

నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చారు. క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్నారు. మొద‌ట జూనియ‌ర్ అసిస్టెంట్ గా ప‌ని చేశారు. అనంత‌రం పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కౌన్సిల‌ర్ గా గెలుపొందారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీలో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. అనంత‌రం ఒడిశాలో మంత్రిగా ప‌ని చేశారు. ప‌రిపాల‌నా ప‌రంగా ఎంతో అనుభ‌వం గ‌డించిన ద్రౌప‌ది ముర్మును జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించింది.

ప్రస్తుతం రాష్ట్ర‌ప‌తి(Draupadi Murmu) అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. 2015 నుంచి 2021 దాకా గ‌వ‌ర్న‌ర్ గా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేశారు. ఆమె ఎక్క‌డికి వెళ్లినా చ‌దువు ప్రాధాన్య‌త గురించి చెబుతూ వ‌చ్చారు. ఆదివాసీ, గిరిజ‌న‌, బ‌హుజ‌నులంతా చ‌దువు కోవాల‌ని పిలుపునిస్తూ వ‌చ్చారు.

Also Read : గుడిని శుభ్రం చేసిన ద్రౌప‌ది ముర్ము

Leave A Reply

Your Email Id will not be published!