Uddhav Thackeray : సంక్షోభం వేళ సీఎం ఠాక్రేకు క‌రోనా

అసెంబ్లీని ర‌ద్దు చేసే చాన్స్

Uddhav Thackeray :  మ‌హారాష్ట్రలో రాజ‌కీయాలు వేడెక్కాయి. శివ‌సేన పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే ధిక్కార స్వ‌రం వినిపించారు. ఆయ‌న త‌నకు 46 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని ప్ర‌క‌టించారు.

నిన్న గుజ‌రాత్ లోని సూర‌త్ హోట‌ల్ లో ఉండ‌గా బుధ‌వారం ఉన్న‌ట్టుండి అస్సాం లోని గౌహ‌తికి చేరుకున్నారు. విచిత్రం ఏమిటంటే గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం కీలకం కానుంది.

ఆయ‌నకు క‌రోనా పాజిటివ్ తేల‌డంతో వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌రో వైపు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) కు సైతం పాజిటివ్ సోకింద‌ని తేలింది.

ప్ర‌స్తుతం ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు కాంగ్ర‌స్ పార్టీ మ‌హారాష్ట్ర ప‌రిశీల‌కుడిగా క‌మ‌ల్ నాథ్ ను నియ‌మించింది. ఆయ‌న కేబినెట్ స‌మావేశానికి ముందు ఉద్ద‌వ్ ఠాక్రేను కల‌వాల్సి ఉంది.

అయితే ఉద్ద‌వ్ ఠాక్రేకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాజిటివ్ అని తేలింది. దీంతో తీవ్ర సంక్షోభం నెల‌కొన్న త‌రుణంలో అత్యవ‌స‌ర స‌మావేశానికి సీఎం హాజ‌రు కావ‌డం లేదు.

ఈ త‌రుణంలో ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్చువ‌ల్ గా హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. ఉద్ద‌వ్ ఠాక్రేను క‌ల‌వాల్సి ఉంద‌ని, అయితే సీఎం కోవిడ్ కు పాజిటివ్ తేల‌డంతో దీంతో వ్య‌క్తిగ‌తంగా క‌లిసేందుకు కుద‌ర‌లేద‌ని చెప్పారు క‌మ‌ల్ నాథ్.

అయితే అంత‌కు ముందు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేబినెట్ మీటింగ్ గురించి చ‌ర్చించారు. ఇదిలా ఉండ‌గా శివ‌సేన‌కు చెందిన 55 మంది ఎమ్మెల్యేల‌లో 46 మంది త‌న వైపు ఉన్న‌ట్లు రెబ‌ల్ లీడ‌ర్ ఏక్ నాథ్ షిండే ప్ర‌క‌టించారు.

వీరితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నార‌ని చెప్పారు.

 

Leave A Reply

Your Email Id will not be published!