Aarti Prabhakar : ఆరతీ ప్రభాకర్ కు బైడెన్ కీలక పోస్ట్
ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ కు నామినేట్
Aarti Prabhakar : అమెరికాలో జోసెఫ్ బైడెన్ ప్రెసిడెంట్ గా , ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ కొలువు తీరాక ప్రవాస భారతీయుల హవా కొనసాగుతంది. ఇప్పటికే వైట్ హౌస్ లో ని కీలక పదవుల్లో ఎన్నారైలు దాదాపు 85 శాతానికి పైగా ఉన్నారు.
ఈ తరుణంలో మరో ప్రవాస భారతీయురాలు ఆరతీ ప్రభాకర్ కు కీలక పోస్ట్ అప్పగించారు బైడెన్. భారతీయ అమెరికన్ , భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఆరతీ ప్రభాకర్(Aarti Prabhakar) ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అడ్వైజర్ గా నియమించారు.
ఓఎస్టీపీకి ఎంపిక కావడం వైట్ హౌస్ లో ఇదే మొదటి సారి. ఇందుకు సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంది. బైడెన్ ప్రభుత్వం లో పని చేయనున్న మూడో ఆసియా అమెరికన్ గా కూడా చరిత్ర లో నిలిచి పోతారు.
ఆరతీ ప్రభాకర్ సలహాదారుగానే కాకుండా ప్రెసిడెంట్ కు ముఖ్యమైన అడ్వయిజర్ గా , సైన్స్ అండ్ టెక్నాల జీ , ప్రెసిడెంట్స్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ కు కో చైర్ గా ఉండనున్నారు.
అంతే కాదు ప్రెసిడెంట్ కేబినెట్ స్యునిగా ఉండబోతున్నారు ఆరతీ ప్రభాకర్(Aarti Prabhakar) . ఈ విషయాన్ని అధికారికంగా వైట్ హౌస్ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కీలకమైన పోస్టులో ఉన్న ఎరిక్ ల్యాండర్ తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో ఈ ఖాళీగా ఉన్న కీలకమైన పోస్ట్ కు ఆరతీ ప్రభాకర్ ను ఏరికోరి నామినేట్ చేశారు జోసెఫ్ బైడెన్.
అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలు ముందుంటారని , అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆరత ప్రభాకర్ అని పేర్కొన్నారు దేశ అధ్యక్షుడు.
Also Read : ఆఫ్గాన్ లో భూకంపం 280 మంది దుర్మరణం