Rahul Dravid : 20 మంది ఆటగాళ్లపై ద్రవిడ్ ఫోకస్
టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక కోసం
Rahul Dravid : ఈ ఏడాదిలో ఆస్ట్రేలియాలో జరిగే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఫ్యాన్స్ సైతం ఉత్సుకతతో ఉన్నారు.
ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డెడ్ లైన్ విధించింది. ప్రపంచంలోని క్రికెట్ జట్లన్నీ వచ్చే 15 సెప్టెంబర్ లోగా తమ వివరాలు ప్రకటించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు అన్ని దేశాల క్రికెట్ కంట్రోల్ బోర్డులకు సూచించింది. ఇందులో భాగంగా బీసీసీఐ సెలక్షెన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ బిజీగా ఉన్నారు.
ఇదే విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ టి20 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పై ఉంటుందని స్పష్టం చేశాడు.
దీంతో రెండు నెలల టైం ఉందని, అంతలోపు మరికొన్ని టి20 మ్యాచ్ లు భారత జట్టు ఆడాక ఫైనల్ టీంను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు ద్రవిడ్.
కనీసం 18 నుంచి 20 మంది ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ లో ఉంది. మరో వైపు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని నెదర్లాండ్స్ లో పర్యటిస్తోంది.
కంటిన్యూగా మ్యాచ్ లు పూర్తయ్యాక ఎవరి సత్తా ఏమిటో తెలిసాక ఎవరెవరు ఉండాలనేది ఎంపిక చేయనున్నట్లు తెలిపారు ద్రవిడ్(Rahul Dravid). 15 మందిని ఎంపిక చేయాల్సి ఉండగా హెడ్ కోచ్ మాత్రం 18 నుంచి 20 మందిని తీసుకు వెళ్లాలని అనుకుంటున్నాడట.
Also Read : ఆసిస్ పరాజయం లంక సీరీస్ కైవసం