Eknath Shinde : మరాఠా సీఎంగా ఏక్ నాథ్ షిండే ..?
సూచించిన ఎన్సీపీ చీఫ్ పవార్
Eknath Shinde : మరాఠా రాజకీయాలు మరింత వేడెక్కాయి. సిఎంఓ ఆఫీసును ఖాళీ చేశారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. తాను తప్పు చేయలేదని ,
తల వంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సస్పెన్స్ ఇంకా కొనసాగే చాన్స్ ఉంది. ఎందుకంటే గవర్నర్ కు కరోనా పాజిటివ్ సోకింది. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు శివసేన పార్టీ రెబల్స్ కు నాయతకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే.
ఆయన ఇప్పటికే తనకు 46 ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఇదే క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం
ఇవ్వాలని కోరుతూ గవర్నర్ , డిప్యూటీ స్పీకర్ కు లేఖలు రాశారు.
ఇందులో 34 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మొత్తం 38 మంది
అన్నమాట. మిగతా వారు ఉద్దవ్ ఠాక్రే వైపు మళ్లారు.
కాగా ధిక్కార స్వరం వినిపించిన మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) గుజరాత్ లోని సూరత్ లో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా అస్సాం లోని గౌహతికి మార్చారు తన మకాంను.
ఇక మొత్తంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆయన వెనుక ఉందన్నది వాస్తవం. ఇదే సమయంలో ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి
గట్టెక్కేందుకు రెబల్ గా ఉన్న ఏక్ నాథ్ షిండేను(Eknath Shinde) సీఎంగా నియమించాలని ఉద్దవ్ ఠాక్రే అధికార మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించినట్లు టాక్.
మరో వైపు తాను బాలా సాహెబ్ ఠాక్రే కుమారుడిని. ఒకరికి తలవంచే ప్రసక్తి లేదు. ఏనాడూ పదవి కోసం పాకులాడ లేదని ప్రకటించారు సీఎం ఠాక్రే. మొత్తంగా కొత్త సీఎంగా కొలువు తీరేంత వరకు ఆపద్దర్మ సీఎంగా ఠాక్రే కొనసాగుతారు.
ఇంకో వైపు సందింట్లో సడేమియా అన్న చందంగా భారతీయ జనతా పార్టీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. ఆయన ఢిల్లీకి వెళ్లారు.
అక్కడి నుంచి రాజకీయం నడుపుతున్నారు. ప్రస్తుతం బలమైన పార్టీగా ఉంది బీజేపీ. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చాన్స్ ఇవ్వాలని ఆయన కోరనున్నారు.
Also Read : ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్