EPS vs OPS : పళనికి షాక్ సెల్వంకు ఊరట
కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ
EPS vs OPS : తమిళనాడులో పవర్ ను కోల్పోయినా ఇంకా పార్టీపై పట్టు కోసం నానా తంటాలు పడుతున్నారు మాజీ సీఎం ఎడాపొడి పళని స్వామి, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం(EPS vs OPS) .
పార్టీ చీఫ్ గా ఎవరు ఉండాలనే దాని గురించి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆపై ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలుగా చీలి పోయారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ పార్టీ పరువును రోడ్డు పాలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికల్లో అన్నాడీఎంకే కు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ సమయంలో బహిష్కృత నాయకురాలు వీకే శశికళ ఆ పార్టీ తనదని, వారికి కాదంటూ ప్రకటన చేసింది.
ఆమె ఓ వైపు వరుస కామెంట్లతో రక్తి కట్టిస్తుంటే పళని స్వామి, పన్నీరు సెల్వం(EPS vs OPS) నువ్వా నేనా అంటూ నిప్పులు చెరుగున్నారు. ఇక పళని స్వామి వర్గానికి చెందిన ఓ కార్యకర్త జయలలిత సమాధి వద్ద ఆత్మహత్యా యత్నం కు ప్రయత్నం చేయడం కలకలం రేపింది.
ఈ తరుణంలో అన్నాడీఎంకే పార్టీ సర్వ సభ్య సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో పార్టీ పగ్గాలు ఎవరికి దక్కాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
పంచాయతీ తెగక పోవడంతో చివరకు వీరిద్దరి ఆధిపత్య పోరు కోర్టుకు చేరింది. అర్ధరాత్రి హై డ్రామా మధ్య పళని స్వామికి కోలుకోలేని షాక్ తగిలింది.
పార్టీలో చర్చ జరగాలని కానీ ఎవరు అధ్యక్షుడు అనే దానిపై నిర్ణయం తీసుకోవద్దంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : శివసేన ఎమ్మెల్యేలు మాతో టచ్ లో లేరు