Gaurav Gogoi : ప్రభుత్వాలను కూల్చే వాళ్లకు వరదలు పట్టవు
కాంగ్రెస్ ఎంపీ గొగోయ్
Gaurav Gogoi : ఓ వైపు అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ బాధ్యత కలిగిన బీజేపీ ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. ఇందు కోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నందంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్(Gaurav Gogoi).
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో రెబల్ శివసేన ఎమ్మెల్యేలకు షెల్టర్ ఇవ్వడంలో చూపినంత శ్రద్ద సీఎం హిమంత బిస్వా శర్మ వరదలపై ఫోకస్ పెట్టడం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
గుజరాత్ లోని సూరత్ హొటల్ లో ఉన్న సదరు ఎమ్మెల్యేలకు పూర్తి సెక్యూరిటీ కల్పిస్తున్న ఘనత ఈ సీఎంకే దక్కుతుందన్నారు గొగోయ్(Gaurav Gogoi). ఇందుకోసమేనా సీఎం ఉన్నది అంటూ ప్రశ్నించారు.
మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే తో పాటు గౌహతిలో ని ఓ టాప్ హోటల్ లో 36 మందికి పైగా ఎమ్మెల్యేలు నిర్బంధించారంటూ ఎంపీ ఫైర్ అయ్యారు.
ఏదైనా సంక్షోభం ఏర్పడితే దానిని ఎలా నివారించాలనే దానిపై ఆయా రాష్ట్రాల వారు చూసుకుంటారు. కానీ ఓ వైపు అస్సాంలో వరదలు పోటెత్తుతున్నాయి. కానీ సీఎం బిస్వా శర్మ మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు.
ఈ విపత్కాల సమయంలో ప్రధాన మంత్రి రాష్ట్రాన్ని సందర్శించాలి. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. కానీ ఆయన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో లేదా గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడని సీరియస్ కామెంట్ చేశాడు గొగోయ్.
అధికారం ఒక్కటే ఇప్పుడు బీజీపీకి సర్వసంగా మారిందని ఎద్దేవా చేశారు.
Also Read : యువతపై కేసులు ఎత్తేయండి – తికాయత్