Sanjay Gandhi : సంజ‌య్ గాంధీకి కాంగ్రెస్ నివాళి

23 జూన్ 1980లో విమాన ప్ర‌మాదం

Sanjay Gandhi : భార‌త రాజ‌కీయాల‌లో సంజ‌య్ గాంధీ పాత్ర కూడా ఉంది. ఆయ‌న దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల పుత్రుడు. 14 డిసెంబ‌ర్ 1946లో పుట్టారు. ఇదే రోజు 23 జూన్ 1980లో విమాన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఎంపీగా కూడా ఉన్నారు. త‌న త‌ల్లి ఇందిరా గాంధీ త‌ర్వాత ప్ర‌ధాన పాత్ర వ‌హిస్తాడ‌ని ఆశించారు. కానీ వాటిని అందుకోకుండానే వెళ్లి పోయారు. ఆయ‌న భార్య మేన‌కా గాంధీ.

ఆమె కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. త‌న‌యుడు వ‌రుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. సంజ‌య్ గాంధీ(Sanjay Gandhi) అకాల మ‌ర‌ణం త‌ర్వాత రాజీవ్ గాంధీ వెలుగులోకి వ‌చ్చారు.

ఇద్ద‌రిలో చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. సంజ‌య్ గాంధీ ముందు నుంచి దూకుడు ఎక్కువ‌. కానీ రాజీవ్ గాంధీ చాలా నెమ్మ‌ద‌స్తుడు. త‌ల్లి ఇందిరా గాంధీని చంప‌డంతో రాజీవ్ గాంధీ ప్ర‌ధాన మంత్రిగా అయ్యారు.

ఆ త‌ర్వాత శ్రీ‌లంక‌కు చేసిన సాయం ఆయ‌న కొంప ముంచేలా చేసింది. ఎల్టీటీఈ కుట్ర‌కు బ‌లై పోయాడు. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. వారి ఫ్యామిలీలో ముగ్గురు వేర్వేరు ప్ర‌మాదాల‌లో మ‌ర‌ణించ‌డం బాధాక‌రం.

స్విట్జ‌ర్లాడ్ లో చ‌దివారు. ఆటోమోటివ్ ఇంజ‌నీరింగ్ ను వృత్తిగా స్వీక‌రించారు. స్పోర్ట్స్ కార్లంటే సంజ‌య్ గాంధీకి ఇష్టం. 1976లో పైల‌ట్ లైసెన్స్ కూడా పొందాడు. జూన్ 1971లో మారుతీ మోటార్స్ లిమిటెడ్ ఏర్పాటైంది.

సంజ‌య్ గాంధీ(Sanjay Gandhi) దానికి ఎండీగా ఉన్నారు. ప్ర‌ధానిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 1977లో జ‌నతా ప్ర‌భుత్వం వ‌చ్చాక దానిని ర‌ద్దు చేశారు. తిరిగి ప్రారంభించ‌బ‌డింది.

Also Read : ఢిల్లీ సీఎంఓ డిప్యూటీ సెక్ర‌ట‌రీ స‌స్పెండ్

Leave A Reply

Your Email Id will not be published!