Australia Deputy PM : చైనాపై ఆస్ట్రేలియా ఉప ప్రధాని కామెంట్
భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య బంధం అవసరం
Australia Deputy PM : ఆస్ట్రేలియా ఉప ప్రధాన మంత్రి(Australia Deputy PM) రిచర్డ్ మార్లెస్ సంచలన కామెంట్స్ చేశారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మనం ఇంతకు ముందు చూడని విధంగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తీర్చిదిద్దాలని చైనా ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ఆస్ట్రేలియా, భారత దేశం మధ్య మరింత బంధం బలపడాల్సిన అవసరం ఉందన్నారు. కాన్ బెర్రా, ఢిల్లీ మధ్య కచ్చితంగా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పారు.
ప్రపంచ నియమాల ఆధారిత క్రమాన్ని రక్షించడంలో ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు రిచర్డ్ మార్లెస్. ప్రధానంగా ఉక్రెయిన్ లో యుద్దం నేపథ్యంలో ఆస్ట్రేలియా డిప్యూటీ సీఎం ఇవాళ భారత దేశంతో సంప్రదింపులు జరిపారు.
అనంతరం ఆయన ఈ కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఆస్ట్రేలియాకు ఉప ప్రధానిగానే కాకుండా రక్షణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత దేశంలో పర్యటించిన మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం. ఎన్నికలు ముగిసిన ఒక నెల తర్వాత మార్లెస్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆస్ట్రేలియా(Australia Deputy PM) ప్రపంచ దృష్టి కోణానికి భారత్ కూడా సహకారం అందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఉప ప్రధాన మంత్రి. అటు ఆస్ట్రేలియా ఇటు భారత్ రెండూ చైనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే రెండు దేశాలకు చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని అంగీకరించారు. భారత్ కు తమ దేశం తరపున సపోర్ట్ ఉంటుందన్నారు .
Also Read : ద్రౌపది ముర్ముకు మోదీ అభినందన