YS Jagan : అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉపాధి
రూ. 700 కోట్లతో ఇనగలూరులో శంకుస్థాపన
YS Jagan : అపాచీ పరిశ్రమ ఏర్పాటు వల్ల 10 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆసరా ఇవ్వాలనే సంకల్పంతో ప్రయత్నం చేస్తోందన్నారు.
గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో రూ. 700 కోట్ల తో ఏర్పాటు చేయబోతున్న అపాచీఈ పరిశ్రమకు సీఎం జగన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
గతంలో పాలకులు మాటలు మాత్రమే చెప్పారని కానీ తాము అధికారంలోకి వచ్చాక ఆచరణలో చేసి చూపిస్తున్నామని చెప్పారు.
ప్రధానంగా తమ లక్ష్యం ఒక్కటే విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, మహిళా సంక్షేమం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడమేనని పేర్కొన్నారు.
ఎంతో కష్టపడి రాష్ట్రానికి అపాచీ పరిశ్రమను తీసుకు రావడం జరిగిందన్నారు జగన్ రెడ్డి(YS Jagan). అందులో భాగంగా తిరుపతి జిల్లాకు రావడం సంతోషకరంగా ఉందన్నారు.
ప్రధానంగా ఇనగలూరును ఎంపిక చేయడం, ఇక్కడ తాను శంకుస్థాపనం చేయడం కలలో కూడా ఊహించ లేదన్నారు.
ఇదిలా ఉండగా అపాచీ పరిశ్రమకు సంబంధించి మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఏడాది లో మరో రూ. 350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం చెప్పారు.
అపాచీ ఇండస్ట్రీలో ప్రధానంగా అడిడాస్ షూస్ , లెదర్ జాకెట్స్ , బెల్ట్ లు , తదితర ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తులు తయారు చేస్తారని వెల్లడించారు జగన్ రెడ్డి.
2023 సెప్టెంబర్ కల్లా అపాచీ కంపెనీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే కంపెనీలో 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
ఇదిలా ఉండగా ఏపీ సర్కార్ సహకారం మరిచి పోలేమన్నారు అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ చెప్పారు.
Also Read : ముడుపులిచ్చారు కోట్లు కొల్లగొట్టారు