Dinkar Gupta : ఎన్ఐఏ చీఫ్ గా మాజీ డీజీపీ దినకర్ గుప్తా
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Dinkar Gupta : భారత దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలలో ఒకటిగా పేరొందిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్ గా కేంద్ర ప్రభుత్వం పంజాబ్ మాజీ డీజీపీ దినకర్ గుప్తా(Dinkar Gupta) ను నియమించింది.
1987 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. గతంలో పంజాబ్ లో కొలువుతీరిన చరణ్ జిత్ సింగ్ చన్నీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ బాస్ గా ఉన్న దినకర్ గుప్తాను తొలగించింది.
ఆ స్థానం నుంచి గుప్తాను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ (పీపీహెచ్ సీ) చైర్మన్ గా నియమించింది. ఇదిలా ఉండగా దినకర్ గుప్తా పదవీ విరమణ తేదీ 31 మార్చి 2024 వరకు ఉంది.
లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఏది ముందుగా జరిగినా ఆయన పదవిలో కొనసాగుతారు ఎన్ఐఏ చీఫ్ గా. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులలో కేంద్రం ఇలా పేర్కొంది.
జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ గా పోస్ట్ స్థాయి -17లో 31 మార్చి 2024 వరకు దినకర్ గుప్తా నియామకం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. పదవీ విరమన తేదీ లేదా తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు అది అమలులో ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం.
చన్నీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దినకర్ గుప్తా(Dinkar Gupta) ఒక నెల సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతా ఆయనను తప్పించి ఆనాటి సర్కార్ 1988వ బ్యాచ్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాకు బాధ్యతలు అప్పగించింది.
మరో ఉత్తర్వుల్లో హోం మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా స్వాగత్ దాస్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం.
Also Read : మరాఠా పీఠంపై వీడని ఉత్కంఠ