Uddhav Thackeray : ఎమ్మెల్యేలు ఇంకెంత దూరం వెళ్లగలరు
శివసేన పార్టీ అధ్యక్షుడు, సీఎం ఉద్దవ్ ఠాక్రే
Uddhav Thackeray : శివసేన పార్టీ చీఫ్, మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణించారు.
ఎవరి ప్రలోభాలకు లోనయ్యారో ప్రజలకు తెలుసన్నారు. ఉద్దవ్ ఠాక్రేకు(Uddhav Thackeray) కరోనా సోకడంతో వర్చువల్ గా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, శ్రేణులను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు.
మీరు ఎంత కాలం ఇతర ప్రాంతాల్లో ఉండగలరు, ఎంత దూరం వెళ్లగలరంటూ ప్రశ్నించారు ఉద్దవ్ ఠాక్రే. కేంద్రం కావాలని కుట్ర పన్నిందన్నది వాస్తవం. శివసేన పార్టీ ఏక్ నాథ్ షిండేను నాయకుడిని చేసింది.
ఎమ్మెల్యేగా గెలిపించింది. మంత్రిగా అవకాశం ఇచ్చింది. అంతేనా ఆపై ఏక్ నాథ్ షిండే తనయుడిని కూడా ఎంపీగా గెలిపించేలా చేసిందన్నారు.
కానీ అందరి దృష్టి తన తనయుడిపై ఉందని, కావాలని టార్గెట్ చేశారంటూ ఆరోపించారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray). రెబల్స్ ఎమ్మెల్యేలు చేస్తున్నది తప్పు. చట్ట విరుద్దం కూడా. వాళ్లు ఇంకెంత కాలం ఉండగలరు, మరాఠాకు రావాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం.
పార్టని కాదనుకుని వెళ్లిన రెబల్స్ గురించి మనం ఎందుకు బాధ పడాలి అని అన్నారు. శివసేనను విడిచి పెట్టడం కంటే చని పోతామని చెప్పిన వారు ఈ రోజు దానిని ఆచరించకుండా పారి పోయారంటూ నిప్పులు చెరిగారు ఉద్దవ్ ఠాక్రే.
మీరు చెట్ల పువ్వులు, పండ్లు , కాండం తీసి వేయవచ్చు. కానీ మీరు మూలాలను నాశనం చేయలేరన్నారు.
Also Read : శివసేన రెబల్స్ ను ప్రజలు క్షమించరు