Eknath Shinde : ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్
ఏ జాతీయ పార్టీ సపోర్ట్ ఇవ్వడం లేదు
Eknath Shinde : మరాఠా రాజకీయం విరాట పర్వాన్ని గుర్తుకు తెచ్చేలా చేస్తోంది. రోజుకో ట్విస్టులతో మరింత రక్తి కడుతోంది. సంక్షోభం కంటిన్యూ అవుతోంది. ఈ తరుణంలో మొత్తం సంక్షోభానికి కారకుడైన మంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) షాకింగ్ కామెంట్స్ చేశారు.
నిన్నటి దాకా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు సూచించారు. కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి వీడాలని కోరారు. మరో వైపు బీజేపీ సైతం వెనుక నుంచి సపోర్ట్ కాకుండా డైరెక్ట్ గా రంగంలోకి దిగింది.
తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇందుకు షిండేతో పాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేబినెట్ లో కీలక పదవులు దక్కుతాయని ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం.
ఈ తరుణంలో మొత్తం సీన్ అంతా ఇప్పుడు అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ కు మారింది. అక్కడి నుంచే మొత్తం రాజకీయాన్ని నడుపుతున్నారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).
ఇదే సమయంలో తాజాగా ఆయన తన మాటల్ని వెనక్కి తీసుకోవడం కలకలం రేపుతోంది. అదేమిటంటే తమకు ఏ జాతీయ పార్టీ మద్ధతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
ఇంకో వైపు శివసేన జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సీరియస్ కామెంట్స్ చేయడం పుండు మీద కారం చల్లినట్లయింది. ఆయన ఏమన్నారంటే ఇంకా శివసేన సైనికులు ఇళ్ల నుంచి రోడ్లపైకి రాలేదన్నారు.
వస్తే తట్టుకోవడం రెబల్స్ కు చేత కాదన్నారు. ఇదే సమయంలో శుక్రవారం కరోనా కారణంగా ఇంటి నుంచే వర్చువల్ గా పార్టీ సమావేశంలో మాట్లాడారు సీఎం ఉద్దవ్ ఠాక్రే.
ఇలా ఎంత కాలం దూరంగా ఉంటారని రెబల్స్ ను ప్రశ్నించారు. ఇక్కడ కాలు మోపకుండా రాజకీయం ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.
Also Read : ఎమ్మెల్యేలు ఇంకెంత దూరం వెళ్లగలరు