Maharastra Deputy Speaker : రెబల్స్ కు డిప్యూటీ స్పీకర్ ఝలక్
రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ
Maharastra Deputy Speaker : శివసేన పార్టీలో సీనియర్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండేకు షాక్ ఇచ్చారు మరాఠా డిప్యూటీ స్పీకర్(Maharastra Deputy Speaker) నరహరి జిర్వాల్. ఆ పార్టికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
మహారాష్ట్రలో తిరుగుబాటు ప్రకటించడంతో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మైనార్టీలో పడి పోయింది. తన వద్ద 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్రకటించారు ఏక్ నాథ్ షిండే.
ప్రస్తుతం ఎమ్మెల్యేలతో కలిసి అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్నారు. మొత్తం వీరి కోసం 70 రూమ్ లు బుక్ చేశారు. రోజుకు రూ. 8 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వారం వరకు బుక్ చేసుకున్నట్లు తెలిసింది.
అంటే రూ. 56 లక్షలు అన్నమాట. ఇది పక్కన పెడితే ఇంకా ఎంత కాలం, ఎంత దూరం వెళ్లగలరని ప్రశ్నించారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. ఏదో ఒక రోజు మహారాష్ట్రలో(Maharastra Deputy Speaker) కాలు మోపాల్సిందేనని, శివసేనను మోసం చేసిన వారు ఎలా ఉండగలరని ప్రశ్నించారు.
వర్చువల్ గా పార్టీ సమావేశంలో ప్రసంగించారు. ఇదే సమయంలో ఇంకా శివసేన సైనికులు ఇళ్లల్లోనే ఉన్నారని బయటకు వస్తే సీన్ వేరేగా ఉంటుందని హెచ్చరించారు శివసేన జాతీయ అధికార ప్రతినిధి , ఎంపీ సంజయ్ రౌత్.
ఇక అనర్హతపై విచారణ సోమవారం జరగనుంది. తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేలు ముంబైలో ఉండాల్సి ఉంటుందని సమాచారం. వారిని అనర్హులుగా ప్రకటించాలని సీఎం కోరారు.
ఆ మేరకు డిప్యూటీ స్పీకర్ ఆమోదించారు. షిండే స్థానంలో అజయ్ చౌదరిని సేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఓకే చెప్పారు. ఇక షిండే శిబిరం చేసిన సూచనను తిరస్కరించారు.
Also Read : ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్