Amit Shah Smitha Prakash : గుజరాత్ అల్లరపై మౌనం వీడిన ‘షా’
సుప్రీంకోర్టు తీర్పు ప్రశంసనీయమన్న మంత్రి
Amit Shah Smitha Prakash : దేశ వ్యాప్తంగా 2002లో సంచలనం సృష్టించిన గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై స్పందించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah).
ఏఎన్ఐ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్మితా ప్రకాశ్(Smitha Prakash) తో శనివారం ట్రబుల్ షూటర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కొన్ని స్వచ్చంధ సంస్థలు, బీజేపీ ప్రత్యర్థులు, వ్యతిరేక భావజాలంతో నడిచే రాజకీయ ప్రేరేపిత జర్నలిస్టులు ఆనాటి ఘటనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
గోద్రా అనంతరం చోటు చేసుకున్న అల్లర్లను అణిచి వేసేందుకు ఆర్మీని పిలవడంలో గుజరాత్ ప్రభుత్వం ఆలస్యం చేయలేదని చెప్పారు అమిత్ షా(Amit Shah).
ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను ఎస్సీ కొట్టి వేసిన తర్వాత ఆయన తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును ఆయన ప్రశంసించారు.
ఇదే సమయంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని అమిత్ షా(Amit Shah Smitha Prakash) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎందు కోసం సత్యాగ్రహం చేస్తున్నారో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.
శివుడు గరళాన్ని మింగినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాధను లోలోపట దాచుకున్నారని చెప్పారు. అల్లర్లకి ప్రాథమిక కారణం గోద్రా రైలు ప్రమాదం. 16 రోజుల చిన్నారితో సహా 59 మందిని తగులబెట్టారని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని ఎలా గౌరవించాలో మోదీజీ ఉదాహరణగా నిలిచారని అన్నారు అమిత్ షా. ఆయనను ప్రశ్నించారు కానీ ఎవరూ ధర్నా చేయలేదన్నారు.
Also Read : అగ్నివీరుల కోసం పెన్షన్ వదులుకుంటా