Rajeev Chandra Sekhar : సామాజిక మాధ్య‌మాల‌పై కేంద్రం ఫోక‌స్

ఐటీ శాఖ స‌హాయ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్

Rajeev Chandra Sekhar : రోజు రోజుకు సామాజిక మాధ్య‌మాల తీరు తెన్నుల‌పై కేంద్రం ఫోక‌స్ పెట్ట‌నుంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా గ‌తి త‌ప్పుతోంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేంద్రానికి వీటి మీద ఎక్కువ‌గా ఫిర్యాదులు అందుతున్నాయి.

గూగుల్, మైక్రో సాఫ్ట్, ఫేస్ బుక్ , ట్విట్ట‌ర్, వాట్సాప్ , త‌దిత‌ర సంస్థ‌ల‌న్నింటీకి గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్ ను ఏర్పాటు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. కొన్ని సంస్థ‌లు కోర్టును ఆశ్ర‌యించినా ఫ‌లితం లేక పోయింది.

చివ‌ర‌కు అన్ని సంస్థ‌లు దిగి వ‌చ్చాయి. కాగా త‌మ డేటాను త‌మ ప‌ర్మిష‌న్ లేకుండా త‌స్క‌రిస్తున్నారంటూ వినియోగ‌దారులు వాట్సాప్ పై ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం నోటీసులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు సైతం కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని సపోర్ట్ చేసింది. తాజాగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్(Rajeev Chandra Sekhar) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

సామాజిక మాధ్యమ వేదికలు ఫిర్యాదుల‌ను త‌గిన విధంగా ప‌రిష్క‌రించం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐటీ రూల్స్ స‌వ‌రించే ముసాయిదా నోటిఫికేష‌న్ పై భాగ‌స్వాముల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు.

ఈ మేర‌కు రూల్స్ ను మార్చ‌డం జ‌రిగింద‌న్నారు చంద్ర‌శేఖర్. గ్రీవెన్స్ ఆఫీస‌ర్ , జ‌వాబుదారీకి చోటు క‌ల్పించామ‌న్నారు. 2021 ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కు లేద‌న్నారు.

కేంద్రం సీరియ‌స్ కావ‌డంతో సామాజిక మాధ్యమ ఫ్లాట్ ఫామ్ లు గ్రీవెన్స్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మిస్తున్నాయ‌ని తెలిపారు. భార‌త చ‌ట్టాల ప‌రిధిలో రూల్స్ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

మాట్లాడే స్వేచ్ఛ‌, గోప్య‌త‌, పౌరుల హ‌క్కుల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేయొద్దంటూ సూచించారు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్(Rajeev Chandra Sekhar).

Also Read : ఐసీటీతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం

Leave A Reply

Your Email Id will not be published!