Sajaya Kakarla : ర‌చ‌యిత్రి స‌జ‌య‌కు అరుదైన గౌర‌వం

అనువాదంలో సాహిత్య అకాడ‌మీ అవార్డు

Sajaya Kakarla : ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, సామాజిక ఉద్య‌మ‌కారిణి సజ‌య కాక‌ర్ల‌కు (Sajaya Kakarla) అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ మేర‌కు అనువాదం చేసినందుకు గాను 2021 సంవ‌త్స‌రానికి సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది.

భాషా సింగ్ ర‌చించిన అదృశ్య భార‌త్ ( నాన్ ఫిక్ష‌న్ ) హిందీ పుస్త‌కాన్ని సజ‌య – అశుద్ధ భార‌త్ – పేరుతో తెలుగు లోకి అనువాదం చేశారు. సాహిత్య అకాడ‌మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ కాంబ‌ర్ నేతృత్వంలో బోర్డు సాహిత్య అకాడ‌మీ అవార్డులు ప్ర‌క‌టించారు.

అనువాద విభాగానికి సంబంధించి స‌జ‌య కాక‌ర్ల‌ను ఎంపిక చేసిన‌ట్ల వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 1, 2015 నుంచి డిసెంబ‌ర్ 2019 మ‌ధ్య కాలంలో దేశంలో ప్ర‌చురించిన పుస్త‌కాల నుంచి అవార్డు గ్ర‌హీత‌ల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపారు.

సాహిత్య అకాడెమీకి సంబంధించి జ్యూరీ స‌భ్యులుగా ఎస్. శేషా ర‌త్నం, వై. ముకుంద రామారావు, గుమ్మ సాంబ‌శివ‌రావు గా వ్య‌వ‌హ‌రించార‌ని చంద్ర‌శేఖ‌ర్ కాంబ‌ర్ స్ప‌ష్టం చేశారు.

దేశంలో ఆద‌ర‌ణ‌కు నోచుకోని పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అశుద్ధ భార‌త్ పేరుతో అక్ష‌ర‌బ‌ద్దం చేసింది. ఈ సంద‌ర్బంగా అవార్డుకు ఎంపికైన వారికి రూ. 50, 000 రూపాయ‌లుతో పాటు తామ్ర‌ప‌త్రం అంద‌జేస్తారు.

2019 సంవ‌త్స‌రానికి గాను భాషా స‌మ్మాన్ల‌ను కూడా ప్ర‌క‌టించింది. ఉత్త‌రాదికి గాను ద‌యానంద్ , ద‌క్షిణ ప్రాంతానికి చెందిన ద‌క్షిణ మూర్తి, తూర్పు ప్రాంతానికి స‌త్యేంద్ర నారాయ‌ణ గోస్వామిని ఎంపిక చేసింది.

ప‌శ్చిమ ప్రాంతానికి ముహ‌మూద్ ఆజం ను ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించారు చంద్ర‌శేఖ‌ర్. స‌మ్మాన్ అవార్డు గ్ర‌హీత‌ల‌కు రూ. ల‌క్ష న‌గ‌దు, తామ్ర‌ప‌త్రం అంద‌జేస్తారు.

Also Read : సంత్ తుకారాం బోధ‌న‌లు అనుస‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!