Dokka Manikya Vara Prasad : సీఎం జగన్ వల్లే సాధ్యమైంది
అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణం
Dokka Manikya Vara Prasad : వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యుడు , మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లాకు భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం ప్రశంసనీయమన్నారు.
ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
శనివారం డొక్కా మాణిక్య వర ప్రసాద్ తాడేపల్లిగూడెం లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఏలిన పాలకులు మాటలు మాత్రమే చెప్పారని కానీ సీఎం మాత్రం ఆచరణలో చేసి చూపించారని కొనియాడారు.
సామాజిక న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం దళితుందరికీ ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
అయితే కోనసీమ జిల్లా పేరు కు సంబంధించి చోటు చేసుకున్న అల్లర్ల ను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించ లేదని ప్రశ్నించారు డొక్కా మాణిక్య వర ప్రసాద్.
అయితే ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. రాజ్యాంగ నిర్మాతను కులాలకు అతీతంగా చూడాలని సూచించారు.
బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తూ ఆయనను వ్యతిరేకించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇందులో భాగంగా అల్లరి మూకలను దూరంగా పెట్టాలని డొక్కా మాణిక్య వర ప్రసాద్(Dokka Manikya Vara Prasad) కోనసీమ ప్రజలకు విన్నవించారు.
Also Read : 27న రూ. 6,594 కోట్లు అమ్మ ఒడి ఖాతాల్లో జమ